లాక్ డౌన్‌లో లాకైన నటి భండారం బట్టబయలు!
హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. అహానా మూడేళ్లకు పైగా నాకు ఆఫర్ రాలేదు.
2022లో మధుర్ భండార్కర్ 'ఇండియా లాక్‌డౌన్'లో చివరిసారిగా కనిపించిన అహానా కుమ్రా గత మూడు సంవత్సరాల నుండి తనకు తన అభిరుచికి తగ్గ పాత్రలు ఏవీ దక్కలేదని ఇటీవల వెల్లడించింది. ఈ భామకు ఎలాంటి నటనా అవకాశాలు రాకపోవడంతో కొత్త కంటెంట్‌ను రూపొందించడంపై తాను స్వయంగా దృష్టి సారించానని తెలిపింది. ఇటీవల స్వీయ ఆర్జన కోసం కొత్త మార్గాన్ని ఎన్నుకున్న ఈ బ్యూటీ తన బిల్లులను చెల్లించడానికి.. పనులు కొనసాగించడంలో సహాయపడటానికి తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది.
హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. అహానా మూడేళ్లకు పైగా నాకు ఆఫర్ రాలేదు. OTTలో చాలా పని చేసేదానిని.. కానీ చాలా సంవత్సరాల నుండి ఏదీ చేయలేదు .. నేను పూర్తిగా బాగానే ఉన్నాను.. కానీ అవకాశాల్లేవ్ అంటూ ఆవేదన చెందింది. అయితే ఇండియా లాక్‌డౌన్ ట్రైలర్: ది హారర్స్ ఆఫ్ పాండమిక్ పేరుతో ట్రైలర్ విడుదల కాగా క్షణాల్లోనే అంతర్జాలంలో వైరల్ అయింది. ఆ తర్వాత మూవీ రిలీజయ్యాక అహనాకు పేరొచ్చింది. 2020లో కోవిడ్-19 రెండు సార్లు లాక్ డౌన్ లకు కారణమైంది. కరోనా కల్లోలం నేపథ్యంలో జీ5 చిత్రం హాట్ టాపిక్ అయింది. ఇందులో శ్వేతా బసు ప్రసాద్- ప్రతీక్ బబ్బర్- అహనా కుమ్రా- సాయి తమంకర్- ప్రకాష్ బెలవాడి తదితరులు నటించారు. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 డిసెంబర్ 2న జీ5లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం అహనా కుమ్రా సోషల్ మీడియాల్లో వరస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తన ఇన్ స్టాలో ఎక్కువగా బాద్ షా షారూఖ్ తో కలసి ఉన్న ఫోటోలను అహనా షేర్ చేసింది. సౌత్ హీరో సూర్యతోను సెల్ఫీ దిగి దానిని పోస్ట్ చేసింది. మరోవైపు అహనా స్పెషల్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వేడెక్కిస్తున్నాయి. అహనా బ్లాక్ కలర్ డిజైనర్ గౌన్ లో ఉన్న ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నె ట్ లో మంటలు పెడుతోంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ అహనా కుమ్రా ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది.
''నేను పక్కింటి అమ్మాయిని అని అందరూ ఎప్పుడూ చెబుతుంటారు. దీని వల్ల మీ అందరికీ చాలా విచిత్రమైన పక్కింటి పొరుగువారు ఉండాలి అని నాకు అనిపిస్తుంది..'' అని ఫన్నీ నోట్ ని రాసింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.