స్టార్ హీరోకి మంచి కంబ్యాక్ ఇస్తుంద‌నుకుంటే!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇటీవలి కాలంలో ఫామ్‌ని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-29 04:59 GMT

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇటీవలి కాలంలో ఫామ్‌ని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అత‌డి చివరి రెండు సినిమాలు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ - లాల్ సింగ్ చద్దా అంచనాలను అందుకోవ‌డంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాయి. బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా మారాయి. అదే స‌మ‌యంలో అత‌డి స‌హ‌న‌టులు అద్భుత విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తారే జ‌మీన్ ప‌ర్ సీక్వెల్ తో మంచి కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.


పాపుల‌ర్ నటుడు ఆర్‌.ఎస్‌. ప్ర‌స‌న్న‌ దర్శకత్వం వహిస్తున్న స్పోర్ట్స్ కామెడీ-డ్రామా `సితారే జమీన్ పర్‌`లో తదుపరి అమీర్ ఖాన్ కనిపించనున్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాని అమీర్ ఖాన్ 2023లో ప్ర‌క‌టించారు. కానీ బాలీవుడ్ మీడియా క‌థ‌నం ప్రకారం.. ఈ చిత్రం క్రిస్మస్ సీజన్లో థియేటర్లలోకి రాదు. సితారే జమీన్ పర్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం తీసుకుంటుందని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని నిర్ణ‌యించిన‌ట్టు మీడియా పేర్కొంది. మూడు నెలల అద‌న‌పు స‌మ‌యం తీసుకుంటార‌ని కూడా తెలుస్తోంది.

అయితే వాయిదాపై మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సితారే జమీన్ పర్ విమర్శకుల ప్రశంసలు పొందిన స్పానిష్ చిత్రం `ఛాంపియన్స్` ఆధారంగా రూపొందింది. ఈ సీక్వెల్ లో జెనీలియా దేశ్‌ముఖ్‌ మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అమీర్ ఖాన్, కిరణ్ రావు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

Tags:    

Similar News