చెస్ లో ఆ హీరో చిచ్చర పిడుగు!
యాక్టింగ్ ఒక్కటే కాదు. చాలా మంది సెలబ్రిటీల్లో ఇంకా చాలా రకాల ట్యాలెంట్ లుంటాయి.
యాక్టింగ్ ఒక్కటే కాదు. చాలా మంది సెలబ్రిటీల్లో ఇంకా చాలా రకాల ట్యాలెంట్ లుంటాయి. అవి సందర్భం వచ్చినప్పుడు బయట పడుతుంటాయి. అఖిల్ మంచి క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. కానీ సినిమా నటుడు అయ్యాడు. ఇంకా డాక్టర్లు అవ్వాల్సిన చాలా మంది హీరోయిన్లు మ్యాకప్ వేసుకుని నటులైపోయారు. అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్టు అమీర్ ఖాన్ కూడా చెస్ ప్లయర్ అవ్వాల్సింది. కానీ నటుడయ్యాడు. అవును అమీర్ ఖాన్ కి చెస్ ఆడటం ఎంత ఇష్టమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆయన కు సినిమా సెట్స్ లో గ్యాప్ దొరికితే చెస్ ఆడతాడుట.
ఖాళీగా ఉన్న వాళ్లని పిలిచి మరీ పదా మన బుర్రకు పదను పెడదామని తీసుకెళ్తారుట. సెట్స్ లో ఉన్నంత సేపు గ్యాప్ దొరికితే ఇదే పనిమీద ఉంటారుట. ఇంట్లో కూడా ఖాళీ ఉంటే చెస్ బోర్డ్ తీసుకుని స్నేహితులకు ఫోన్ చేసి రప్పిస్తాడుట. ఇలా ఆడటం తనకు ఎంతో ఇష్టమని అంటున్నారు. చెస్ ఛాంపియన్ విశ్వనాధ్ ఆనంద్ తో కూడా అమీర్ చెస్ ఆడిన సందర్భం ఉంది. అలా ఆ ఇద్దరు ఓ సందర్భంలో చెక్ మేట్ అయ్యారు. ఇలా చెస్ ఆడటంలో వల్ల ఒత్తిడి జయించొచ్చు అని అంటున్నారు అమీర్.
బుర్రకు పదును పెట్టినట్లు అవుతుందని...మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి అవకాశం ఉందని తెలిపారు. అలాగే క్రీడలు ఆడటం అన్నా ఎంతో ఇష్టమట. ఆటలు చూడటం కూడా అంతే ఆస్వాదిస్తానని తెలిపారు. అదీ అమీర్ ఖాన్ లో ఉన్న మరో క్వాలిటీ. ప్రస్తుతం అమీర్ ఖాన్ కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తోన్న సంగతి తెలిసిందే. `లాల్ సింగ్ చడ్డా`తో భారీ పరాజయం..విమర్శలు ఎదుర్కోవడంతో తదుపరి ఏ సినిమా చేసినా అది బాలీవుడ్ హిస్టరీ తిరగరాసేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కథ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సినిమాకి పూర్తిగా దూరం కాకుండా ఈ గ్యాప్ లో నిర్మాతగానూ బిజీ అవుతున్నారు. అలాగే పాన ఇండియాలోనూ ఓ సినిమా చేయాలని చూస్తున్నారు. అది రాజమౌళి ప్రాజెక్ట్ అయితే అంతకన్నా భాగ్యం ఏముంటుందని అమీర్ వెయిట్ చేస్తున్నారు. ఆయన తోసినిమా చేయాలని రాజమౌళి సైతం ఆసక్తిగానే ఉన్నారు. కానీ బిజీ షెడ్యూల్ నడుమ వీలు పడటం లేదు.