'కనీసం చెప్పకుండా అనౌన్స్ చేసేశారు'.. జయం రవి భార్య ఆవేదన!
కోలీవుడ్ హీరో జయం రవి రీసెంట్ గా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు నెట్టింట అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
కోలీవుడ్ హీరో జయం రవి రీసెంట్ గా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు నెట్టింట అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా డివోర్స్ తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగగా.. వాటిని నిజం చేస్తూ ఆయన నిన్న సంచలన ప్రకటన చేశారు. తమ విడాకుల విషయం పూర్తి వ్యక్తిగతమని తెలిపారు. తమతో పాటు తమ ఫ్యామిలీ మెంబర్స్ గోప్యతను గౌరవించాలని కోరుతున్నట్లు చెప్పారు. రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
అయితే ఇప్పుడు విడాకుల విషయంపై జయం రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. విడాకుల ప్రకటన గురించి తనకు తెలియకుండానే అనౌన్స్ చేసేశారని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. జయం రవి ప్రకటన చూసి చాలా బాధపడ్డానని తెలిపారు. 18 ఏళ్ల పాటు కలిసి జీవించామని.. కానీ తన నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా విడాకులను ప్రకటించడం వల్ల దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.
కొన్ని రోజులుగా తమ మధ్య ఏర్పడిన విబేధాలను, మనస్ఫర్థలను సాల్వ్ చేసుకోవడానికి అనేక సార్లు ట్రై చేశానని ఆర్తి తెలిపారు. కానీ తనతో జయం రవి నేరుగా మాట్లాడటం లేదని చెప్పారు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికీ కూడా ట్రై చేస్తున్నానని వెల్లడించారు. కానీ ఒక్కసారి కూడా మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది తన దురదృష్టమని అన్నారు.
జయం రవి తీసుకున్న ఏక పక్ష నిర్ణయానికి తనతోపాటు పిల్లలు చాలా షాకయ్యామని ఆర్తి తెలిపారు. విడాకుల విషయంలో చాలా బాధగా ఉందని చెప్పారు. కానీ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని పేర్కొన్నారు. కానీ తనపై కొందరు చాలా నిందలు వేస్తున్నట్లు వెల్లడించారు. వాటిని భరించడం ఎంతో బాధగా ఉందని చెప్పారు. పిల్లలపై ఆ ఎఫెక్ట్ పడకూడదని భావిస్తున్నట్లు ఆర్తి పేర్కొన్నారు.
ఏదేమైనా.. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందని ఆర్తి అన్నారు. దాన్ని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తమకు మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్ తో పాటు మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. దయచేసి తమ గోప్యతకు ఎవరూ ఎలాంటి విధంగా భంగం కలిగించొద్దని కోరుతున్నట్లు తెలిపారు. అయితే జయం రవి, ఆర్తి వివాహం 2009లో జరగ్గా.. వారి బంధానికి గుర్తుగా ఇద్దరు కుమారులు ఉన్నారు.