సీనియర్ నటి చెప్పు దెబ్బకు యంగ్ హీరోయిన్ ఏడుపే ఏడుపు
కెరీర్ ఆరంభమే ఇండస్ట్రీ బెస్ట్ స్టార్లతో నటించే అవకాశం అందుకుంది సదరు యంగ్ లేడీ. హీరోయిన్ గా తొలి అవకాశమే తనను ఎంతో ఎగ్జయిట్ చేసింది
కెరీర్ ఆరంభమే ఇండస్ట్రీ బెస్ట్ స్టార్లతో నటించే అవకాశం అందుకుంది సదరు యంగ్ లేడీ. హీరోయిన్ గా తొలి అవకాశమే తనను ఎంతో ఎగ్జయిట్ చేసింది. కానీ డెబ్యూ సినిమాలో తనకు ఎదురైన ఆ చెంప దెబ్బ అనుభవం తన జీవితాన్నే మార్చేసింది. ఇండస్ట్రీ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్, గోవిందా, ఉపేంద్ర వంటి స్టార్ల సరసన నటించిన సదరు యంగ్ ట్యాలెంటెడ్ గాళ్ ఆ తర్వాత ఏకంగా ఇండస్ట్రీ నుంచే నిష్కృమించింది. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో యంగ్ హీరోయిన్ ఎవరు? అంటే.. ఆర్తి చాబ్రియా. ఉత్తరాది దక్షిణాదికి కూడా ఈ భామ సుపరిచితురాలు.
తెలుగులో ఈ బ్యూటీ నటించిన 'ఒకరికి ఒకరు'(2003) క్లాసిక్ ప్రేమకథా చిత్రంగా యువతరం హృదయాలను గెలుచుకుంది. శ్రీరామ్ ఈ చిత్రంలో కథానాయకుడు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆర్తి చాబ్రియా అందచందాలు నటన ముగ్ధులను చేసాయి. హిందీలో ఆరంగేట్రం తర్వాత రెండేళ్లకే టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఆర్తి. అటుపై శ్రీకాంత్, ప్రభుదేవాలతో కలిసి 'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి' అనే రొమాంటిక్ కామెడీలోను నటించింది. అయితే అంతకుముందే ఆర్తి చాలా మంది బాలీవుడ్ సూపర్స్టార్లతో కలిసి పనిచేసింది. 2001లో లజ్జా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆర్తి చాబ్రియా కు అనూహ్యమైన అనుభవం ఎదురైంది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన లజ్జా మహిళా ప్రధాన పాత్రలతో తెరకెక్కింది. ఆర్తి చాబ్రియా ఈ చిత్రంలో రేఖ, మాధురీ దీక్షిత్, మహిమా చౌదరి, సోనాలి బింద్రే, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగన్, డానీ, గుల్షన్ గ్రోవర్ వంటి అనేక మంది అనుభవజ్ఞులైన నటీనటులతో తెరను పంచుకున్నారు.
సినిమాలోని ఓ సన్నివేశంలో రేఖ ఆర్తి చాబ్రియాను చాలాసార్లు చెప్పుతో కొట్టాల్సి వచ్చింది. అయితే ఆర్తి చాబ్రియాకు ఈ సన్నివేశం గురించి ముందుగా తెలియదు. అందుకే ఈ సీన్ షూట్ చేసినప్పుడు ఆమె షాక్‌కు గురైంది. రేఖ ఆమెను చాలాసార్లు చెంపదెబ్బ కొట్టింది. అది కూడా చెప్పుతో. దీని కారణంగా ఆర్తి చాబ్రియా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. సన్నివేశం చిత్రీకరించిన తర్వాత, ఆర్తి చాబ్రియా చాలాసేపు దానిని జీర్ణించుకోలేకపోయింది. సెట్లో ఏడుస్తూనే ఉంది. అయితే ఘటన తర్వాత రేఖ -రాజ్‌కుమార్ సంతోషి ఆ సన్నివేశం గురించి దానిని చిత్రీకరించడం వెనుక ఉన్న కాన్సెప్ట్ గురించి ఆర్తి చాబ్రియాకు వివరించినప్పుడు ఓకే అనుకుందిట.
చాలా సంవత్సరాల పాటు తన కెరీర్లో ఆర్తి చాబ్రియా చాలా మంది పాపులర్ స్టార్లతో కలిసి పనిచేసింది. నకుల్ కపూర్‌తో 'తుమ్ సే అచ్చా కౌన్ హై'లో, అక్షయ్ కుమార్ 'ఆవారా పాగల్ దీవానా'లో, గోవిందతో 'రాజా భయ్యా'లో .. సల్మాన్ ఖాన్‌తో కలిసి 'పార్ట్నర్'లో పనిచేసింది. అయితే బాలీవుడ్లో ఆశించిన పెద్ద విజయం సాధించలేకపోయిన ఆర్తి చాబ్రియా ఇతర భాషలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా విజయం సాధించకపోవడంతో అనూహ్యంగా గ్లిట్జ్ అండ్ గ్లామర్ ప్రపంచానికి దూరమైంది.
నాలుగేళ్ల క్రితం ప్రముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడి సినీప్రపంచానికి దూరమైంది. అయితే సినిమాలు చేయకపోయినా కానీ సోషల్ మీడియాల్లో తన అభిమానులకు ఈ బ్యూటీ టచ్ లో ఉంది. ఈరోజు ఆర్తి చాబ్రియా లైఫ్ స్టైల్ ఫ్యాషన్ వీడియోలతో కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది. మారిషస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విశారద్ బీదాస్సీతో యంగేజ్ అయింది. 2019 లో ముంబైలో ఒక ప్రైవేట్ వేడుకలో అతడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రమ్ లో ఆర్తి చాబ్రియా ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.