పుష్ప 2 టికెట్స్‌ ఇస్తానన్న సౌత్‌ఆఫ్రికా స్టార్ క్రికెటర్‌

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో రూపొంది మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమా సోషల్‌ మీడియా సందడి అంతా ఇంతా లేదు.

Update: 2024-12-03 04:22 GMT

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో రూపొంది మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమా సోషల్‌ మీడియా సందడి అంతా ఇంతా లేదు. ప్రతి చోట పుష్ప 2 గురించిన చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ లేనంతగా ఒక సినిమా గురించి చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ సినిమా భారీ చర్చ జరుగుతోంది. ఈ సమయంలో సినిమాతో పాటు తమ సంస్థలను ప్రమోట్‌ చేయడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సౌత్‌ఆఫ్రికా మాజీ స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ పుష్ప 2 టికెట్లు ఇస్తానంటూ ప్రకటించాడు.

సోషల్‌ మీడియా ద్వారా డివిలియర్స్ ఒక వీడియోను షేర్‌ చేయడం జరిగింది. అందులో ఆన్‌ లైన్‌ గేమింగ్‌ పోర్టల్‌ అయిన Wolf7payలో వంద లేదా అంతకు మించి డిపాజిట్‌ చేసి ఆట ఆడిన మొదటి 10,000 మందిలో కొందరిని ఎంపిక చేసి పుష్ప 2 సినిమా టికెట్లు బహుమానంగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఈ ఏడాదిలోనే అతి పెద్ద బ్లాక్‌ బస్టర్ మూవీ టికెట్లు పెందాలి అంటే వెంటనే Wolf7payలో లాగిన్‌ కావాలంటూ డివిలియర్స్ పిలుపునిచ్చాడు. శనివారం వరకు ఈ టికెట్ల గివ్అవే ఉంటుందని, అప్పటి వరకు ఆన్‌ లైన్ గేమ్‌లో జాయిన్‌ కావాలంటూ ఆయన పిలుపునిచ్చాడు. పుష్ప 2 తో తన బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్స్‌ను బ్యాన్‌ చేయాలంటూ చాలా మంది డిమాండ్‌ చేస్తూ ఉన్న ఈ సమయంలో పుష్ప 2 ఆశ చూపించి Wolf7payలో జాయిన్ కావాలంటూ డివిలియర్స్ చెప్పడం విడ్డూరంగా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేయడం అంటే తమ అభిమానులను మోసం చేయడం, వారి జీవితాలను నాశనం చేయడం అనేది చాలా మంది అభిప్రాయం. అయినా ప్రముఖులు కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారు. పుష్ప 2 క్రేజ్‌ని ఉపయోగించుకుని ఈ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రమోట్‌ చేస్తూ ఉన్నారు.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన పుష్ప 2 లో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. పాటలు అన్నీ మాస్‌ మసాలా బీట్స్‌తో సాగి సినిమాపై అంచనాలు పెంచాయి. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ సైతం కుమ్మేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ 4 నుంచే అంటే రేపు ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ప్రీమియర్‌ షోలు భారీ ఎత్తున వేయడంతో పాటు, టికెట్ల రేట్లు భారీగా ఉన్న కారణంగా కచ్చితంగా రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్ నమోదు కావడం కన్ఫర్మ్‌.

Tags:    

Similar News