నన్ను హిజ్రా అనుకుని వెంట పడ్డారు!

గత నెల హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముంజ్య మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Update: 2024-07-02 05:34 GMT

గత నెల హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముంజ్య మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శర్వరి, మోనా సింగ్‌ లు కీలక పాత్రల్లో నటించిన ముంజ్య లో హీరోగా అభయ్‌ వర్మ నటించాడు. ఇండస్ట్రీకి కొత్త హీరో దొరికాడు అంటూ సినిమా విడుదల అయినప్పటి నుంచి అభయ్‌ వర్మ గురించిన చర్చ జరుగుతోంది.


హీరోగా ముందు ముందు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించేందుకు ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నట్లుగా ముంజ్య నటుడు అభయ్‌ వర్మ పేర్కొన్నాడు. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభయ్ వర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

హర్యానా కి చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అభయ్ వర్మ చిన్నప్పటి నుంచి ఆర్థిక పరమైన పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఒక వైపు చదువుకుంటూ మరో వైపు సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టిన అభయ్ వర్మ కి సూపర్ 30 లో మొదటి సారి జూనియర్ ఆర్టిస్టుగా ఛాన్స్ దక్కిందట.

గత సంవత్సరం సఫేద్ అనే సినిమాలో అభయ్ వర్మ ట్రాన్స్ జెండర్‌ గా నటించాడట. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో మేకప్‌ తోనే కొన్ని సార్లు హోటల్‌ కు వెళ్లాల్సి వచ్చిందట. అలా వెళ్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు వెంట పడి వేదించారట. కుర్రాళ్ళు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారట.

రోడ్డు మీద వెళ్తున్న తనను కుర్రాళ్లు వెంబడించడం జరిగింది. వారు నన్ను హిజ్రా అనుకుంటున్నారని అర్థం అయ్యింది. వారితో నేను సినిమా కోసం హిజ్రా వేషం వేశాను, అంతే తప్ప నేను హిజ్రాను కాదు అని చెప్పుకోవాల్సి వచ్చిందని అభయ్‌ పేర్కొన్నాడు. కెరీర్ ఆరంభం లో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లుగా అభయ్‌ తెలియజేశాడు.

Tags:    

Similar News