ఆ నిర్మాత దర్శకత్వంలో ఈసారి ఫుల్ మూవీ

నిర్మాతలు దర్శకులుగా మారి సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో నిర్మాత విజయ్ బాపినీడు దర్శకుడిగా మారి ఎన్నో విజయాలు అందుకున్నారు

Update: 2024-09-29 01:30 GMT

నిర్మాతలు దర్శకులుగా మారి సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో నిర్మాత విజయ్ బాపినీడు దర్శకుడిగా మారి ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా కూడా పూర్తిస్థాయిలో దర్శకుడిగా మారబోతున్నారు. డెవిల్ సినిమాతో ఆయన ఇప్పటికే దర్శకుడిగా పరిచయం అయ్యారు.

నిజానికి ఈ సినిమాని నవీన్ మేడారం తెరకెక్కించారు, కానీ దర్శకుడితో విభేదాల కారణంగా చివరి నిమిషంలో అభిషేక్ నామా ఆ చిత్రం దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నారని టాక్ వచ్చింది. గతంలో గ్రాఫిక్స్ రంగంలో అనుభవం ఉండటంతో, దర్శకత్వం చేయడం ఈజీ అయిందని డెవిల్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అభిషేక్ నామా తెలిపారు. ప్రస్తుతం నిర్మాతగా అభిషేక్ నామా వివిధ చిత్రాలను నిర్మిస్తున్నారు.

ఆయన బ్యానర్‌లో గూఢచారి 2, గరుడ: చాప్టర్ 1 చిత్రాలు రూపొందుతున్నాయి. అయితే, ఇప్పుడు అభిషేక్ నామా పూర్తిస్థాయిలో దర్శకుడిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఒక ఇంటరెస్టింగ్ కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. తొలుత నిర్మాతగానే ఈ సినిమాని అభిషేక్ నామా తెరకెక్కించాలని అనుకున్నారట.

కానీ ఏదో కారణంగా, ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను ఆయన స్వయంగా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మించడం లేదని సమాచారం. అఖండ, పెదకాపు సినిమాలను భారీ బడ్జెట్‌తో నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో మిర్యాల రవీందర్ రెడ్డి బంధువు విరాట్ కర్ణ హీరోగా నటించే అవకాశమున్నట్లు సమాచారం. విరాట్ కర్ణ పెదకాపు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్న విరాట్, ఇప్పుడు అభిషేక్ నామా దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

డెవిల్ సినిమాతో అభిషేక్ నామా దర్శకుడిగా ప్రూవ్ చేసుకోలేకపోయినా, ఈ కొత్త సినిమాతో మాత్రం డైరెక్టర్‌గా సక్సెస్ సాధించి, తనపై విమర్శలు చేసిన వారికి సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News