విడాకుల క‌థ‌నానికి లైక్ 'కొట్టి' డౌట్లు పెంచిన హీరో!

అభిషేక్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో విడాకుల కష్టాలు, పెరుగుతున్న ట్రెండ్ గురించి చర్చ‌లో భాగ‌మ‌య్యాడు. ఇది అంద‌రి దృష్టిని ఆకర్షించింది.

Update: 2024-07-18 16:30 GMT

చాలా కాలంగా ఐశ్వ‌ర్యారాయ్- అభిషేక్ బ‌చ్చ‌న్ జంట విడిపోతున్నారంటూ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. అందుకు సింబాలిక్ గా అంబానీ పెళ్లిలో అభిషేక్ బ‌చ్చ‌న్ కుటుంబంతో కాకుండా తాను విడిగా ప్ర‌త్య‌క్ష‌మైంది ఐశ్వ‌ర్యారాయ్. బచ్చన్ కుటుంబ సభ్యులు లేకుండా అంబానీ పెళ్లి వేడుక‌లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య విడిగా క‌నిపించ‌డంతో అది సందేహాలు రాజేసింది. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, శ్వేతా బచ్చన్‌లతో అభిషేక్ కెమెరాలకు పోజులిచ్చిన కొన్ని నిమిషాల‌ తర్వాత ఐశ్వ‌ర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి కనిపించింది. దీంతో ఆ ఇద్ద‌రూ క‌లిసే ఉన్నారా? అంటూ మీడియాలో మ‌రోసారి క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా అభిషేక్ బ‌చ్చ‌న్ చర్య మ‌రోసారి చ‌ర్చ‌గా మారింది. అభిషేక్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో విడాకుల కష్టాలు, పెరుగుతున్న ట్రెండ్ గురించి చర్చ‌లో భాగ‌మ‌య్యాడు. ఇది అంద‌రి దృష్టిని ఆకర్షించింది. త‌న భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ అనంత్ అంబానీ పెళ్లిలో ఒంటరిగా కనిపించిన కొద్ది రోజులకే అభిషేక్ ఆన్‌లైన్ లో విడాకుల క‌ష్టాల‌పై చ‌ర్చ పెట్ట‌డం దేనికి సింబాలిక్? అంటూ మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

రచయితలు హీనా ఖండేల్వాల్ షేర్ చేసిన పోస్ట్‌లో ''ప్రేమ లైట్ తీసుకునేదిగా మారిన‌ప్పుడు పెళ్లి చేసుకున్న జంటలు విడిపోతున్నారు. వారి నిర్ణయానికి కారణమేమిటి? గ్రే విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి? పెరుగుతున్న విడాకుల కేసులపై కథనం గురించి క్యాప్షన్‌తో ఒక ఫోటోని అభిషేక్ బ‌చ్చ‌న్ షేర్ చేసారు.

''విడాకులు ఎవరికీ అంత సులభం కాదు. వృద్ధ జంటలు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న ఆ హృదయాన్ని కదిలించే వీడియోలను మళ్లీ రూపొందించాలని కలలు కనేవారు ఇవేవీ ఊహించలేరు? అయినప్పటికీ కొన్నిసార్లు జీవితం మనం ఆశించినట్లుగా సాగదు. కానీ భార్యాభ‌ర్త‌లు దశాబ్దాల తర్వాత ఒక‌రి నుంచి ఒక‌రు విడిపోయినప్పుడు వారి జీవితంలో గణనీయమైన భాగాన్ని పెద్ద, చిన్న విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడి గడిపిన తర్వాత వారు బ్రేక‌ప్ ని ఎలా భరించగలరు? బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది? విడిపోతే వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? ఈ ప్రశ్నలను ఈ కథ పరిశోధిస్తుంది. యాదృచ్ఛికంగా 'గ్రే విడాకులు' లేదా 'సిల్వర్ స్ప్లిటర్స్' సాధారణంగా 50 ఏళ్ల తర్వాత వివాహాన్ని రద్దు చేసుకోవాలనుకునే వారి నిబంధనలు-ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కారణాలు వైవిధ్యంగా ఉన్నప్పటికీ, ఆశ్చర్యం లేదు''అని అత‌డి పోస్ట్ లో రాసి ఉంది.

ఈ పోస్ట్‌ను 'లైక్' చేసిన చాలా మంది వ్యక్తులలో అభిషేక్ బ‌చ్చ‌న్ ఒకరు. అత‌డి చ‌ర్య సందేహాలు రాజేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ రెడ్డిట్‌లో భాగస్వామ్యం చేయ‌డంతో అది వైర‌ల్ గా చ‌ర్చ‌కు తెర లేపింది. చాలా మంది వ్యాఖ్యల విభాగంలో త‌మ అభిప్రాయాలు చెప్పారు. చాలా మంది అధ్వాన్నంగా ఊహాగానాలు సాగించినా కానీ అభిషేక్‌ను సమర్థించిన వారు లేక‌పోలేదు. ''ఇది సాధారణ ఇష్టం కావచ్చు.. అభిషేక్ వ్య‌క్తిగ‌త జీవితంతో సంబంధం లేదు'' అని కొంద‌రు అన్నారు. కైసే తుమ్ లాగ్ ఇత్నా అబ్జర్వ్ కర్ లేతే హో యార్... జస్ట్ హౌవావ్ అని ఒక సోషల్ మీడియా యూజర్ విస్మయంతో అన్నారు. (ఇది) ఒక టాపిక్/పోస్ట్‌లో అర్థవంతంగా ఉండేలా సాధారణంగా అత‌డు లైక్ చేసాడు! అని మరొకరు వ్యాఖ్యానించారు.

ఆస‌క్తిక‌రంగా అంబానీ పెళ్లిలో అభిషేక్.. ఐశ్వ‌ర్యారాయ్ విడివిడిగా క‌నిపించినా కానీ... వివాహ వేదిక లోపల నుండి వీడియోలు, ఫోటోలు బ‌య‌ట‌కు రాగా.. వాటిలో ఐశ్వర్య- ఆరాధ్య అభిషేక్‌తో తిరిగి కలుసుకున్నారని, వివాహానికి కలిసి హాజరయ్యారని వెల్లడైంది. అభిషేక్ - ఐశ్వర్య వివాహం జరిగి ఇప్పటికి ప‌దిహేడు సంవత్సరాలు అయింది. వారి వ‌య‌సు 50ల‌లో ఉంది. ఈ వ‌యసులో బ్రేక‌ప్ ఆలోచ‌న వారికి ఉండ‌ద‌ని కూడా అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News