పిక్ టాక్ : పింక్ చీర కట్టులో సొట్టబుగ్గల సుందరి
తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగు సినిమా ఝుమ్మంది నాదం తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ తాప్సి. రాఘవేంద్ర రావు మెచ్చిన ముద్దుగుమ్మ అవ్వడంతో మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా ఇండస్ట్రీలో ఆమెకు మంచి ఆఫర్లు లభించాయి. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
సౌత్ లో మంచి సినిమాలు చేసిన ఈ అమ్మడు కమర్షియల్ గా బడా విజయాలను మాత్రం అందుకోలేక పోయింది. దాంతో మెల్ల మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈ అమ్మడికి కాలం కలిసి వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు.. కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా నిలిచింది.
హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ అమ్మడు ఫిల్మ్ ఫేర్ కవర్ పేజీపై నిలిచింది. అందాలకు అడ్డా అయిన ఫిల్మ్ ఫేర్ కవర్ పేజీ పై మరింత అందంగా తాప్సి కనిపిస్తుంది.
పింక్ చీర కట్టు లో ఆహా అనిపించేంత అందంగా ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఇంత అందం ఈమెకే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ అందంను పొగడుతూ ఉన్నారు. ఇంత అందంగా ఉన్న తాప్సి ని తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ముందు ముందు అయినా మళ్లీ అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.