ఉల్లిపొర డిజైన్ లో హీటెక్కిస్తోన్న సుందరాంగి!
ఇన్ స్టాని ఎంత పిండితే అంత! అవకాశం ఏ రూపంలో వరిస్తుందో తెలియదు. సోషల్ మీడియాతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వారున్నారు.
ఇన్ స్టాని ఎంత పిండితే అంత! అవకాశం ఏ రూపంలో వరిస్తుందో తెలియదు. సోషల్ మీడియాతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వారున్నారు. ఆ ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని అవకాశాలు అందుకున్న భామలకి కొదవలేదు. అలాగని అందరికీ కలిసి రావాలని లేదు. లక్కీగా ఫలానా ఛాన్స్ రాసిపెట్టి ఉంటే వస్తుంది. అలాంటి సమయంలో ఇన్ స్టా లాంటి వేదికలే కీ రోల్ పోషిస్తుంటాయి.
అందుకే అవకాశం వచ్చినా? రాకపోయినా? ఇన్ స్టాని రెండు రకాలుగా వినియోగిస్తున్నారు హీరోయిన్లు. ఒకటి ఖాతా ద్వారా పాపులరై కొంత ఆదాయం సమకూరడం..అదే పాపులారిటీతో ఛాన్సులు దక్కించు కోవం. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్న చందంగా కొందరికి ఇన్ స్టా బాగానే పనికొచ్చింది. అందుకే ఏ నటి కూడా ఇన్ స్టాని తక్కువ అంచనా వేయదు. మాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా ఇన్ స్టాలో కాక పుట్టించే ఫోటోల్ని ఎప్పటికప్పుడు వదులుతోన్న సంగతి తెలిసిందే.
ఆ క్రేజ్ తోనే 3.1 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకుంది. ఇటీవలి కాలంలో అప్డేడెటెడ్ వెర్షన్ ఫోటోల తోనూ కుర్రాళ్లలో సలపరం పుట్టిస్తుంది. కొత్త రకం ఫ్యాషన్ ఎంపికల్లో తనదైన మార్క్ వేస్తుంది. తాజాగా అమ్మడు పలుచని ఉల్లిపొర లాంటి దుస్తుల్లో కి దూరిపోయింది. ఫోల్డర్ లెస్ డిజైన్ లో సొగసరి నుంచి సెగలు పుట్టించే స్నాప్ ఇది. షోల్డర్ పై లేస్ వేసుకునే వెసులు బాటు ఉన్నా...వాటిని కిందకు జార విడిచి కైపెక్కిస్తుంది.
చూపులతో మత్తెక్కించే బాధ్యత తీసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఐశ్వర్య అభిమానులు టెంప్టింగ్ కామెంట్లతో ఎటాకింగ్ కి దిగుతున్నారు. ఈ బ్యూటీ `పొన్నియన్ సెల్వన్` లో ఇంట్రెస్టింగ్ రోల్ తో మెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులో `మట్టికుస్తీ.. `గాడ్సే`..` అమ్ము` లాంటి చిత్రాలలోనూ నటించింది. ఇటీవల రిలీజ్ అయిన `కింగ్ ఆఫ్ కోతా`లోనూ నటించింది. కానీ వైఫల్యాలు అమ్మడి ఎఫెర్ట్ ని వృద్దా చేసాయి.