బంధువుల ఇళ్ల‌కు వెళ్తే నిర్మోహ‌మాటంగా పొమ్మ‌నేవారు!

ముంబై న‌టుడు ర‌వి కాలే గ‌రించి ప‌రిచ‌యం అస‌వ‌రం లేదు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసిన న‌టుడు

Update: 2024-11-12 17:30 GMT

ముంబై న‌టుడు ర‌వి కాలే గ‌రించి ప‌రిచ‌యం అస‌వ‌రం లేదు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసిన న‌టుడు. ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 300 చిత్రాల్లో వివిధ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించాడు. ముఖ్యంగా నెగిటివ్ పాత్ర‌ల్లో అత‌డికంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది.` షాక్`, `దృశ్యం`, `దండు పాళ్యం` లాంటి సినిమాలు తెలుగులో ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి.

` దండుపాళ్యం`లో గ్యాంగ్ లీడ‌ర్ గా కాలే పోషించిన పాత్ర మాత్రం మాసివ్ గా ఉంటుంది. ఆ పాత్ర‌తో ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యాడు. అత‌డి మొర‌టి లుక్..బేస్ వాయిస్ ఇట్టే ప‌ట్టేస్తారు ఆడియ‌న్స్. తాజాగా ర‌వి కాలే ఓ ఇంట ర్వ్యూలో ఇండ‌స్ట్రీ క‌ష్టాల గురించి ఓపెన్ అయ్యారు. `నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర‌య్యాయి. జీవితమే ఒక పోరాట మైనప్పుడు ఇలాంటి గాయాలు అవుతూనే ఉంటాయని అనుకునేవాడిని.

అప్పట్లో డబ్బులు ఉండేవి కాదు. అందు వలన చాలా ఇబ్బందులు పడేవాడిని. ఎక్కడికైనా సరే ఎక్కువగా నడిచే వెళ్లేవాడిని. ఓ పూట మాత్ర‌మే అన్నం తినే వాడిని. టీ కూడా తాగేవాడిని కాదు. పండుగ వస్తే బంధువుల ఇళ్లకి వెళ్లి పిండివంటలు తినొచ్చు. ఉల్లాసంగా గడపొచ్చునని అనుకునేవాడిని. మా బంధువులు మా సొంత ఊరు వస్తే వాళ్లను మా అమ్మ ఎంతో ప్రేమగా చూసేది. ఎన్నో రకాల వంటలు చేసిపెట్టేది. వాళ్ల ఇంటికి వెళితే నన్ను కూడా అలాగే చూస్తారని అనుకున్నాను.

కానీ నెను ఎప్పుడెళ్లినా తమ మధ్య గొడవ జరిగినట్టుగా నటించేవారు. చిరాకుతో ఉన్నట్టుగా కనిపిస్తూ, నన్ను వెళ్లిపొమ్మనేవారు. అప్పుడు నేను ఆకలితో తిరిగొచ్చి గార్డెన్ లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరు మనవాళ్లు? అని నాకు అప్పుడే అని పించింది. కష్టాలే నాకు పాఠాలు నేర్పాయి. అవమానాలే నన్ను అభివృద్ధిలోకి తెచ్చాయి` అని ఎమోష‌న‌ల్ అయ్యారు.

Tags:    

Similar News