సుందరం ముందు చాలా ఆప్షన్స్
నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దాడి చేస్తూనే ఉన్నాడు. దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని అనుకున్న స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు.
నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దాడి చేస్తూనే ఉన్నాడు. దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని అనుకున్న స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. దసరా సినిమా విడుదలకు ముందే కొత్త దర్శకుడితో సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. 'హాయ్ నాన్న' అనే టైటిల్ తో రాబోతున్న ఆ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. హాయ్ నాన్న సినిమా విడుదలకు ముందే నాని కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. నాని దసరా అనుభవం మరియు హాయ్ నాన్న ఔట్ పుట్ నేపథ్యంలో కొత్త సినిమా విషయంలో మరింత సమయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఆ మధ్య అంటే సుందరానికి ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సినిమా ప్రారంభం కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. వివేక్ రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో నాని సంతృప్తి చెందక పోవడంతో మళ్లీ కొత్త స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఒక తమిళ దర్శకుడి దర్శకత్వంలో కూడా నాని సినిమా ఉండే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేశాయి.
మరో వైపు దసరా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. మొత్తానికి నాని ముందు మల్టీపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో ఏది బెస్ట్ ఏంటి అనేది హాయ్ నాన్న సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలోపు నాని ఎంపిక చేసుకుంటాడేమో చూడాలి.
సహజ నటుడిగా మంచి పేరు దక్కించుకున్న నాని సినిమాలకు మినిమం గ్యారెంటీ అనే టాక్ క్రియేట్ అయింది. అందుకే నాని ఏ సినిమా చేసినా కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. తన ఇమేజ్ కు తగ్గట్లుగా ఉంటూనే, కొత్తదనంతో కూడిన కథలను నాని ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. తదుపరి సినిమా కూడా అలాగే ఉంటుందేమో చూడాలి.