తండేల్ ఈవెంట్ కు బన్నీ ఎందుకు రాలేదంటే..
శ్రీకాకుళం జిల్లాలోని మత్య్సకారుల జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను రూపొందించాడు.
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని మత్య్సకారుల జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను రూపొందించాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడని మేకర్స్ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. తండేల్ జాతర పేరుతో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తండేల్ రాజు కోసం పుష్పరాజ్ వస్తున్నాడని మేకర్స్ బాగా ప్రమోట్ చేశారు.
సంధ్య థియేటర్ దర్ఘటన తర్వాత బన్నీ పాల్గొననున్న మొదటి ఈవెంట్ ఇదేనని, ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అసలేం మాట్లాడతాడా అని అందరూ బన్నీ స్పీచ్ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. కానీ తీరా చూస్తే ఈ ఫంక్షన్ కు బన్నీ రాలేదు. దీంతో బన్నీ కోసం, ఆయన స్పీచ్ కోసం ఎదురుచూసిన అందరికీ నిరాశ తప్పలేదు.
అయితే ఈ సినిమా ఈవెంట్ కు బన్నీ ఎందుకు రాలేదో తన తండ్రి అల్లు అరవింద్ ఈవెంట్ లో చెప్పాడు. బన్నీ ఈ ఫంక్షన్ కు రావాల్సిందని, కాకపోతే బన్నీ ఫారిన్ కు వెళ్లి రావడంతో గ్యాస్ట్రైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే రాలేకపోతున్నానని తన మాటగా ఆడియన్స్ కు బన్నీ చెప్పమన్నాడని అల్లు అరవింద్ చెప్పాడు.
ఇక సినిమా విషయానికొస్తే ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఆల్రెడీ రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తండేల్ కు ఈ రేంజ్ లో బజ్ రావడానికి పాటలే కారణం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా, తన కెరీర్లోనే స్పెషల్ ఫిల్మ్ గా నిలవనుందని నాగ చైతన్య భావిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.