అభిమానిపై బౌన్స‌ర్లు దాడి..హీరో క్ష‌మాప‌ణ‌లు!

సెల‌బ్రిటీలు జనాల్లోకి వ‌స్తే ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2023-08-27 16:55 GMT

సెల‌బ్రిటీలు జనాల్లోకి వ‌స్తే ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. సెల్పీలు కోసం ఎగ‌బ‌డ‌టం వంటివి స‌హ‌జంగా చోటు చేసుకుంటాయి. అలాంటి స‌మ‌యంలో కుదిరితే సెల్పీలు ఇస్తారు. లేక‌పోతే లేదు. కొన్ని సంద‌ర్భాల్లో హీరోలు సైతం అభిమానుల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేసిన సంఘ‌ట‌న లున్నాయి. వాళ్లు అభిమానంతో మీద మీద ప‌డినా! చాలా వ‌ర‌కూ హీరోలు ఓపిక‌గానే ఉంటారు. ఆ అభిమానం హ‌ద్దు మీరితేనే ప‌క్క‌కు లాగేస్తుంటారు. అయితే ఈ ఘ‌ట‌న అందుకు భిన్న‌మైంది.

లారెన్స్ న‌టించిన `చంద్ర‌ముఖి -2` ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంగి తెలిసిందే. తాజాగా కాలేజీలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా వేదిక వెలుపల ఓ స్టూడెంట్ పై బౌన్సర్ చేయిచేసుకున్నారుట‌. అదీ అకార‌ణంగా చేసుకున్న‌ట్లు తెలిసింది. దీంతో అభిమానుల్ని ఇలా కొడ‌తారా? అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వైర‌ల్ అయ్యాయి.

హీరోపై అభిమానం చూపిస్తే దాడుల‌కు పాల్ప‌డటం ఏంట‌ని కొంద‌రు మండి ప‌డుతున్నారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై లారెన్స్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. `ఈ ఘ‌ట‌న గురించి నాకు ఆల‌స్యంగా తెలిసింది. వివాదం వేదిక బ‌య‌ట చోటు చేసుకుంది. ఆ సమయంలో నేను ఆడియో ఫంక్ష‌న్ లోప‌ల ఉన్నాను. నాకు విష‌యం ఇప్పటివ‌ర‌కూ తెలియ‌దు. ఈవెంట్ నిర్వాహకులకు కూడా ఈ విష‌యం తెలియ‌దు.

విద్యార్దులు అంటే ఎంతో గౌర‌వం. వాళ్ల‌ని ఎంత‌గానో ప్రేమిస్తాను. వారు జీవితంలో ఎదగాలని కోరుకునే వ్యక్తిని. ఇలాంటి గొడ‌వ‌ల‌కు వ్య‌తిరేకం. అన్ని వేళ‌లా ప్ర‌శాంతంగా ఉండాల‌ని కోరుకుంటాను. అందులో నూ ఒక‌రిపై దాడి జ‌రిగిందంటే నాకు చాలా బాధ‌గా ఉంటుంది. ఆ స్టూడెంట్ విష‌యంలో నాకు తెలియ కుండా త‌ప్పు జ‌రిగింది. ద‌య‌చేసి క్ష‌మించండి. కొట్ట‌డం పెద్ద త‌ప్పు. ఓ స్టూడెంట్ కి అలా జ‌రిగి ఉండ‌కూడ‌దు. బౌన్స‌ర్లు ఇలాంటి గొడ‌వ‌ల జోలికి వెళ్ల‌కూడ‌దు. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా అంద‌రిప‌ట్ల చాలా స‌హ‌నంగా ఉండాలి. అది బౌన్స‌ర్ల బాధ్య‌త‌` అని అన్నారు.

Tags:    

Similar News