హీరోగా చేసినా లేని డిమాండ్ ఇప్పుడు అతనిది..!
ఐతే ఆల్రెడీ కమెడియన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారు కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా అదరగొట్టడం మాత్రం కొత్తగా చెప్పుకోవచ్చు.
సినిమా పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా క్రేజ్ సంపాదిస్తారన్నది చెప్పడం కష్టం. తమ పని తాము చేసుకుంటూ వెళ్లే ప్రతి ఒక్కరు ఇక్కడ కచ్చితంగా సక్సెస్ అవుతారని అందరు చెబుతుంటారు. ఐతే కొందరు సినిమాల మీద ఆసక్తితో ఒక రంగంలో తమ టాలెంట్ చూపించాలని వస్తే ఇక్కడ మరో విధంగా వారికి అవకాశాలు వస్తాయి. హీరో అవుదాం అనుకున్న వారు విలన్.. విలన్ అవ్వాలని అనుకుంటే కమెడియన్ ఇలా ఎవరిని ఎలాగైనా మార్చేస్తారు. ఐతే ఆల్రెడీ కమెడియన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారు కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా అదరగొట్టడం మాత్రం కొత్తగా చెప్పుకోవచ్చు.
టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్. అతని కామెడీ టైమింగ్ తో చాలా తక్కువ టైం లోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒకానొక దశలో సునీల్ లేని సినిమా లేదు అనిపించేలా చేశాడు. ఐతే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి హీరో అవ్వాలని ఉంటుంది. అలానే సునీల్ కూడా హీరో అవ్వాలని అనుకుని కమెడియన్ గా ఛాన్సులు వచ్చినా చేయకుండా హీరోగా ప్రయత్నించాడు. ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా తర్వాత సునీల్ హీరోగా క్లిక్ అవ్వలేదు.
మళ్లీ తన పాత పంథానే కొనసాగిస్తూ కమెడియన్ గా చేస్తున్న సునీల్ కి సడెన్ గా విలన్ వేశాలు రావడం మొదలయ్యాయి. సునీల్ విలన్ గా చేసిన సినిమాలు సక్సెస్ అవ్వడం తో అలాంటి రోల్స్ మళ్లీ మళ్లీ వస్తున్నాయి. కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా సునీల్ కి నెగిటివ్ రోల్స్ బాగా వస్తున్నాయి. ఈమధ్యనే మలయాళం నుంచి కూడా విలన్ రోల్ వచ్చిందని తెలుస్తుంది. అంతేకాదు విలన్ గా సునీల్ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉందని టాక్.
కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా సునీల్ కి తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు. హీరోగా మారిన కూడా కోటి రెండు కోట్ల కంటే ఎక్కువ తీసుకోలేదు. కానీ విలన్ గా సునీల్ కి ప్రస్తుతం 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. సునీల్ విలనిజం ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అందుకే అతనికి వరుస నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి. హీరోగా చేసినప్పుడు కూడా లేని డిమాండ్ సునీల్ విలన్ గా చేస్తున్నప్పుడు వచ్చిందని చెప్పొచ్చు. ఇదే ఫాం కొనసాగిస్తే సునీల్ విలన్ గా పూర్తిస్థాయిలో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.