చెల్లి అంటే సూర్యకి ప్రాణం!
కోలీవుడ్ సీనియర్ నటుడు శివకుమార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన బ్రదర్స్ సూర్య-కార్తీ తమిళ చిత్ర సీమలో రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ సీనియర్ నటుడు శివకుమార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన బ్రదర్స్ సూర్య-కార్తీ తమిళ చిత్ర సీమలో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. తండ్రి నటుడే అయినా అన్నదమ్ములిద్దరు కష్టపడి పైకి ఎదిగిన వారు. తండ్రి సహకారం లేకుండా స్టార్లు అయిన వారు. ఈ విషయంలో సూర్య కష్టంతోనే ఇది సాధ్యమైంది. సూర్య నటుడి కావడానికి ముందు ప్రయివేటు ఉద్యోగాలు చేసాడు. ఆర్దిక కష్టాలు తెలుసు.
అయినా సినిమాలపై ప్యాషన్ తో తనకు తానుగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. అటుపై కార్తీ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి నటుడయ్యాడు. అన్నదమ్ముల ఇద్దరి జర్నీలో శివకుమార్ ఎక్కడా లేరు. వారికి వారుగానే స్వయంగా ఎదిగిన నటులు. అన్నదమ్ములిద్దరికీ తెలుగులోనూ భారీ అభిమానులున్నారు. ఇక కుటుంబ పరంగా చాలా కాలం అంతా కలిసేవారు.
సూర్య-కార్తీలు పెళ్లి చేసుకున్నా ఒకే ఇంట్లో ఉండేవారు. ఫ్యామిలీతో ఎంతో ఎటాచ్ మెంట్ ఉన్న నటులు.
సూర్య-కార్తీలకు ఓ సిస్టర్ కూడా ఉన్నారు. ఆమె పేరు బృందం. సూర్యకి చెల్లిగా...కార్తీకి అక్కగా ఉన్నారు. బృంద అంటూ సూర్యకి ప్రాణమట. అన్నయ్య అన్నా! చెల్లి అంతే ప్రేమిస్తుందిట. అలాగే అన్నయ్య అంటే భయం కూడా ఎక్కువేనట. బృంద కోసం సూర్య ఏదైనా చేసేస్తాడుట. ఇక కార్తీ-బృంద మాత్రం టామ్ అండ్ జెర్రీలా ఉంటారుట.
ఇద్దరు ఇంట్లో ఉంటే గొడవ పడని రోజు అంటూ ఉండదట. కార్తీ ఇంట్లో అల్లరి పిల్లాడుట. ఎప్పుడు ఫన్నీగా ఉంటాడు. కార్తీని జ్యోతిక ఓ మరిదిలా కాకుండా తమ్ముడిగా..స్నేహితుడిగా ..కుమారుడిలా చూస్తుందిట. అలాంటి కుటుంబం నుంచి సూర్య ఇప్పుడు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అనివార్య కారణాల తో సూర్య-జ్యోతిక దంపతులు ముంబైలో ఉంటున్నారు. పిల్లలు ఇద్దరు ముంబైలోనే చదువుతు న్నారు. సూర్య మాత్రం ముంబై టూ చెన్నై తిరుగుతున్నారు. అలాగే జ్యోతిక కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.