మగాళ్లు చట్టాలు చేసినంతకాలం..ప్రముఖ నటి ఫైరింగ్!
అందాల కథానాయికలు రియా సేన్, రైమా సేన్ తెలుగు చిత్రసీమకు సుపరిచితులు.
అందాల కథానాయికలు రియా సేన్, రైమా సేన్ తెలుగు చిత్రసీమకు సుపరిచితులు. కానీ ఆశించిన స్థాయికి ఈ సిస్టర్స్ ఎదగలేదు. ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అయితే నటి రైమా సేన్ ఇటీవల భారతదేశంలో.. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మాట్లాడారు. తాజా ఇంటర్వ్యూలో నటిగా తాను ఎల్లపుడూ అసురక్షితంగా ఉన్నానని రైమా సేన్ అంగీకరించారు. వ్యవస్థాగత ఆధిపత్యం, దుర్వినియోగం అనే సైకిల్ తన నిరాశకు కారణమైందని వెల్లడించారు. అంతేకాదు దోషులను కఠినంగా శిక్షించాలని కూడా రైమా పిలుపునిచ్చారు.
మలయాళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బెంగాళీ నటి,
సహోద్యోగి రితభారి చక్రవర్తి వ్యవహారంపై స్పందిస్తూ, రైమా సేన్ (44) హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు సినీపరిశ్రమలలో జరుగుతున్నాయని అన్నారు. అయితే తనకు వ్యక్తిగతంగా అలాంటి అనుభవమేదీ లేదని పేర్కొంది. నేను దీనిని (మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలు) ఎదుర్కోలేదు కాబట్టి దానిపై వ్యాఖ్యానించలేను. కానీ వీటన్నింటికీ ముగింపు లేకుండా పరిస్థితి అలాగే ఉండిపోయిందని అన్నారు.
అత్యాచారాలను అరికట్టడానికి ఏకైక మార్గం `తక్కువ నేరాల`కు కూడా కఠినమైన శిక్షలు విధించడం. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తేవాల్సి ఉంది. మీటూ ఉద్యమం భారతదేశంలో కొనసాగినా, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు! అని అన్నారు. నిరాశను వ్యక్తం చేస్తూ, ఒక మహిళగా తాను తరచుగా అసురక్షితంగా భావిస్తున్నానని రైమా అంది. లైంగిక వేధింపులు ప్రతిచోటా జరుగుతాయి. మరొక #MeTooను ఉపసంహరించుకోవడంలో అర్థం లేదు. భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను మహిళలు మాత్రమే చేయగలరు. పురుషులు మహిళల కోసం చట్టాలు చేసినంత కాలం మహిళలు సురక్షితంగా ఉండరు. ఏ రాష్ట్రమైనా, ఏ రాజకీయ నాయకుడికి అయినా దేశమంతటా అత్యాచారాలు జరుగుతున్నా ఫర్వాలేదు. ప్రతి రాష్ట్రంలోనూ వీటిని దారుణంగా మేనేజ్ చేస్తున్నారు.. న్యాయ వ్యవస్థలు ఏమీ చేయలేవు! అని అన్నారు.
రైమా సేన్ చివరిగా `బస్తర్: ది నక్సల్ స్టోరీ`లో కనిపించింది. ఆ తర్వాత `మా కాళి`లో కనిపించనుంది. ఈ చిత్రం డైరెక్ట్ యాక్షన్ డే నౌఖలీ ఊచకోతలలోని విషాద సంఘటనలను వివరిస్తుంది. `మా కాళి`లో 16 ఆగష్టు 1946 నాటి బాధాకరమైన సంఘటనలను తెరపై ఆవిష్కరిస్తుంది. ఇది బెంగాల్ చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఇది ది వీక్ ఆఫ్ ది లాంగ్ నైవ్స్ సమయంలో విస్తృతంగా మతపరమైన హింసకు తెర తీసిన సంఘటనల సమాహారం. కులమత ఘర్షణలను తెరపై చూపిస్తున్నారు.