సెలబ్రిటీ మేనేజర్ల ఆదాయం కూడా కోట్లలోనా?
సౌత్ హీరోలను పక్కనబెట్టి బాలీవుడ్ హీరోల మేనేజర్ల సంగతి చూస్తే? షాక్ అవ్వాల్సిందే.
స్టార్ హీరోలు....హీరోయిన్ల ఆదాయం ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల స్టార్ డమ్ ఆధారంగా కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు. కోటి నుంచి 300 కోట్ల వరకూ అందుకునే హీరోలు న్నారు. హీరోయిన్లు మాత్రం 50 కోట్ల లోపు అందుకుంటారు. సినిమాని...అప్పటి హీరో స్టార్ డమ్ ని బట్టి పారితోషికం ఉంటుంది. మరి హీరోలు కోట్లలో సంపాదిస్తుంటే? వాళ్ల సిబ్బంది ఆదాయం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మేనేజర్లకు జీతాలు ఎలా ఉంటాయి? అంటే దిమ్మ తిరిగే విషయమే తెలుస్తోంది.
సౌత్ హీరోలను పక్కనబెట్టి బాలీవుడ్ హీరోల మేనేజర్ల సంగతి చూస్తే? షాక్ అవ్వాల్సిందే. స్టార్ హీరోలంతా వాళ్ల మేనేజర్లకు సైతం ఏడాదిలో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే హీరో, హీరోయిన్లకు మేనేజర్లు అనేది అత్యంత కీలకం. హీరోలను షెడ్యూల్ చేసేది వాళ్లే. హీరోల వ్యవహారాలన్నీ వాళ్లే దగ్గరుండి చూసు కుంటారు. డేట్స్, ప్రమోషన్స్, బిజినెస్, ఇంకా ఇతర వ్యవహారాలన్నీ వాళ్లే డీల్ చేస్తుంటారు.
మేనేజర్ అంటే నిత్యం ఆ హీరో, హీరోయిన్ ని అంటి పెట్టుకుని తిరగడమే పనిగా ఉంటుంది. షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీకి ఏడాదిక 7-9 కోట్లు షారుక్ ఖాన్ చెల్లిస్తారుట. ప్రియాంక చోప్రా మేనేజర్ అంజల ఆచార్యకు 6 కోట్లు చెల్లిస్తుందిట. కరీనా కపూర్ తన మేనేజర్ పూనమ్ 3 కోట్లు .. రణవీర్ సింగ్ మేనేజర్ సుసాన్ కు 2 కోట్లు ఛార్జ్ చేస్తుంటారుట. ఇంకా స్టార్ హీరోలు, హీరోయిన్లు చాలా మంది ఇలా కోట్లు చెల్లించే వారున్నారు.
ఆ మేనేజర్లపై ఒత్తిడి సైతం అలాగే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ నిరంతరం బిజీగానే ఉంటారు. ఈ పారితోషికమే కాకుండా హీరోల ఇమేజ్ తో అదనంగానూ మేనేజర్లకు కొంత ఆదాయం సమకూరుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ హీరోల మేనేజర్లు మిగతా పరిశ్రమలందరి కంటే భిన్నంగా ఉంటారని పేర్కొంటున్నారు. బాలీవుడ్ తర్వాత ఆ తరహా వాతావరణం ఎక్కువగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో కనిపిస్తుంది.