ఇత‌రుల కోసం మొర‌టు ప్ర‌వ‌ర్త‌న‌ మార్చుకోలేన‌న్న న‌టి

ఒక సెలబ్రిటీ ఎలా ప్రవర్తించాలి? ముఖ్యంగా మచ్చలేని ఇమేజ్‌ని మెయింటెయిన్ చేయడం లేదా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవ‌డం ఎలా?

Update: 2024-10-25 14:30 GMT

ఒక సెలబ్రిటీ ఎలా ప్రవర్తించాలి? ముఖ్యంగా మచ్చలేని ఇమేజ్‌ని మెయింటెయిన్ చేయడం లేదా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవ‌డం ఎలా? ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నిస్తే బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి కాజోల్ చెప్పిన స‌మాధానం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అదే స‌మ‌యంలో త‌న నిజాయితీ కూడా అంద‌రినీ ఆక‌ర్షించింది. ఇటీవ‌ల దుర్గా పూజ‌లో కొంద‌రిపై సీరియ‌స్ అయిన కాజోల్ ఉగ్ర‌రూపంపై మీడియాలో వార్తా క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం జూమ్ ఇంట‌ర్వ్యూలో కాజోల్ ముచ్చ‌టించారు.

నిజానికి ఇలాంటి విష‌యాల్లో ప్ర‌జాభిప్రాయానికి తగినట్లుగా తనను తాను ఎడిట్ చేసుకోవడానికి తాను నిరాకరిస్తానని కాజోల్ స్పష్టం చేసింది. ``నాకు కోపం వస్తుంది.. నాకు మంచి రోజులు ఉన్నాయి.. చెడ్డ రోజులు ఉన్నాయి.. అది నేనే. ఒక సెలబ్రిటీ గ‌నుక‌ నిగ్రహాన్ని కోల్పోకూడదు అనే ఇత‌రుల‌ ఆలోచన కోసం నేను మార‌లేనని.. నన్ను పదే పదే సవరించుకోలేన``ని చెప్పారు కాజోల్. అంతేకాదు అలాంటి స‌మ‌యాల్లో త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను త‌ప్పుగా మీడియా ఫోక‌స్ చేస్తోంద‌ని, రియాలిటీకి ఫోటోలు వీడియోలు చూడ‌టానికి తేడా ఉంటుంద‌ని కూడా అన్నారు.

అంతకుముందు విజ‌య ద‌శ‌మి రోజున‌ దుర్గా పూజ పండల్‌(పండుగ‌)లో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌పై కాజోల్ విరుచుకుప‌డింది. కొంద‌రు చెప్పుల‌తోనే దేవ‌త వ‌ద్ద‌కు విచ్చేయ‌గా వారిని వారిస్తూ కాజోల్ ధుమ‌ధుమ‌లాడారు. భ‌క్తులు ఉన్న చోట‌ వారంతా గుంపుగా మీద ప‌డ‌టం కాజోల్‌కు కోపం తెప్పించింది. విసుగు చెంది దర్శనం కోసం వచ్చిన ఫోటోగ్రాఫ‌ర్ల‌ను పక్కకు తప్పుకోవాలని కాజోల్ గట్టిగా అరిచేస్తూ కోరింది. ``అంజౌలీ కోసం ప్రజలు మీ వెనుక నిలబడి ఉన్నారు. దయచేసి పక్కకు వెళ్లండి.. దయచేసి సైడ్ హో జాయే, పీచే హో జైయే. అంజౌలీ దేనే కే లియే లోగో కో ఆనే దీజియే`` అని సీరియ‌స్ గా హెచ్చ‌రించారు కాజోల్.

అదే రోజు దుర్గా పూజ వేడుకలో కాజోల్ ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ ని క‌న‌బ‌రిచిన ఫోటోలు వీడియోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యాయి. వాటిపై ట్రోలింగ్ కూడా తీవ్రంగా న‌డిచింది. అంత‌కుముందు వెట‌ర‌న్ స్టార్ జయ బచ్చన్‌ను ఆప్యాయంగా పలకరించిన కాజోల్ అకస్మాత్తుగా వెనుదిరిగింది. ఆ ప‌రిస‌రాల్లో గ్యాప్ అన్న‌దే లేకుండా నిరంతర ఈల శబ్ధాల‌కు విసుగు చెందింది. వీల‌లు విజిల్స్ వేసేవాళ్ల‌ను చూస్తూ ఆందోళనకు గురైన ఆమె, ఎవరు శబ్దం చేస్తున్నారో చూడండ‌ని సెక్యూరిటీ గార్డును కోరింది. కొంత సీరియ‌స్ గా క‌నిపించిన కాజోల్ ``కౌన్ హై యే, సీతీ కౌన్ బాజా రహా హై? (ఎవరు ఈలలు వేస్తున్నారు?) అతడిని ఆపమని చెప్పండి.. ఇది హాస్యాస్పదంగా ఉంది`` అంటూ గుస్సాయించింది. ఫోటోగ్రాఫ‌ర్ల‌తో పాటు ఇత‌రుల‌తో కాజోల్ కొంత సీరియ‌స్ గానే స్పందించ‌డంతో అది కాస్తా మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చింది. అయితే ఇత‌రుల ఆలోచ‌న కోసం తాను మార‌లేన‌ని కాజోల్ సూటిగా చెప్పేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాను మార‌న‌ని కూడా స్ప‌ష్ఠంగా చెప్పారు ఈ భామ‌.

Tags:    

Similar News