బెబో మోనాలిసా అవ‌తారం

బెబో క‌రీనా మోనాలిసా అవ‌తారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది! క‌రీనా నెవ్వ‌ర్ బిఫోర్ లుక్..! ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

Update: 2024-09-15 11:30 GMT

బెబో క‌రీనా మోనాలిసా అవ‌తారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది! క‌రీనా నెవ్వ‌ర్ బిఫోర్ లుక్..! ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. దీనికి మైండ్ బ్లోయింగ్ బెబో! అంటూ కుర్ర‌కారు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. అనితా ష్రాఫ్ అద‌జానియా రూపొందించిన ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ షో ఇది. బెబో క‌రీనా వంద శాతం ఈ షోకి న్యాయం చేసింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. స్టైల్ ఐకాన్ గా, జీరో సైజ్ బ్యూటీగా త‌న‌కు ఉన్న ఇమేజ్ ని మ‌రోసారి క‌రీనా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఎంపిక చేసిన యూనిక్ డిజైన్.. మేక‌ప్ సెన్స్ .. ఫోజ్ ఇలా అన్ని కోణాల్లో ఈ ఫోటోషూట్ ని విశ్లేషిస్తున్నారు. క‌రీనా షేడ్స్ ఆఫ్ న్యూ* పేరుతో దీనిని అడ‌జానియా త‌న సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారుతోంది.

అంత‌టి విద్యుదీకరణ శక్తిని ప్రసరింపజేసే వారితో ఐకాన్స్ కవర్‌ను షూట్ చేయడం ఎల్లప్పుడూ మరపురాని అనుభవం. బెబో ఎప్పుడూ ప్రకంపనలతో అంటుకుంటుంది. అది సృజనాత్మకత అనే అభిరుచితో మండుతుంది. ఈ మంట‌ ఎప్పుడూ తీవ్రంగా ఉంటుంది.. ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంది.. సరదాగా ఉంటుంది! అని అనితా అడ‌జానియా ఎమోష‌న‌ల్ పోస్ట్ ని షేర్ చేసారు. నేను ఎక్కువగా ఇష్టపడేది ఆమె(క‌రీనా) నిష్కపటమైన విశ్వాసం.. ఆమె తన స్పేస్‌ని ఎంత అప్రయత్నంగా సొంతం చేసుకుంది - ఆమె నిజమైన ప్రేరణ. ఇలాంటి క్షణాలకు నేను కృతజ్ఞురాలిని. ఈ షూట్ కోసం చాలా మంది ప్రతిభావంతులైన స్నేహితులు సహకరించడం, ఒక ప్రత్యేకత నిండిన మ్యాజిక్‌ని తెస్తుంది. మేం మీ కోసం సృష్టించిన దాన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను అని రాసారు.

భారతీయ చిత్రసీమలో 25 ఏళ్ల ప్ర‌యాణం:

బెబో కరీనా కపూర్ భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌ 25 సంవత్సరాల కెరీర్ జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఇటీవ‌లే విడుదలైన `ది బకింగ్‌హామ్ మర్డర్స్`లో త‌న న‌ట‌న‌కు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది 13 సెప్టెంబర్ 2024న థియేటర్‌లలోకి వచ్చింది. పింక్‌విల్లా క‌థ‌నం ప్రకారం.. కరీనా గౌరవార్థం ఫిల్మ్ ఫెస్టివల్ ప్లాన్ చేసార‌ని తెలిసింది. బాలీవుడ్‌లో రెండున్న‌ర‌ దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో క‌రీనా న‌టించిన‌ మరపురాని సినిమాల‌ను ఈ పండ‌గ‌లో ప్ర‌ద‌ర్శిస్తారు. బెబో తన పనికి పూర్తిగా అంకితం అయిన‌ మొదటి భారతీయ నటిగాను గుర్తింపు పొందింది.

ఇంతకుముందు దిలీప్ కుమార్ -అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాల కోసం మాత్రమే ఇటువంటి ఉత్సవాలు నిర్వహించారు. ఇప్పుడు `కరీనా కపూర్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్` మల్టీ-సిటీ ఈవెంట్‌గా కొన‌సాగ‌నుంది. ప్రేక్షకులకు క‌రీనా న‌టించిన క్లాసిక్ చిత్రాలను పెద్ద స్క్రీన్‌పై మళ్లీ వీక్షించే ఏకైక అవకాశాన్ని అందించే ఈవెంట్ ఇది. కరీనా నిర్మాతగా అరంగేట్రం చేసిన క్రైమ్ థ్రిల్లర్ `ది బకింగ్‌హామ్ మర్డర్స్` విడుదలతో సమానంగా ఈ వేడుక సరైన సమయంలో ప్లాన్ చేస్తున్నారు.

ది బకింగ్‌హామ్ మర్డర్స్ విడుదల రోజున కరీనా సోషల్ మీడియాలో హార్ట్ ట‌చింగ్ పోస్ట్‌ను షేర్ చేసింది. న‌టిగా, నిర్మాతగా తన పాత్రకు గర్వంగా ఉన్నాన‌ని తెలిపింది. త‌న‌ ఎంపికల విష‌యంలో చాలా గర్వపడుతున్నాను అని తెలిపింది. ది బంకింగ్ హామ్ మ‌ర్డ‌ర్స్ సినిమాని చూడమని, నేరం- నాటకాల ప్రపంచాన్ని అన్వేషించమని బెబో కోరుకుంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కరీనా డిటెక్టివ్ జస్మీత్ భమ్రా పాత్రను పోషించింది.

Tags:    

Similar News