బేబమ్మ... వాళ్లు ఎవరో చెప్పమ్మా?
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతిశెట్టి.
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బేబమ్మ అంటూ కృతి శెట్టిని తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ఒక్క సినిమా హిట్ తో పది సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది. పాపం దురదృష్టం తో కృతి శెట్టికి ఉప్పెన తర్వాత ఆ స్థాయి విజయం సొంతం అవ్వలేదు. ముఖ్యంగా తెలుగు లో కృతి చివరగా నటించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో టాలీవుడ్ లో కృతి శెట్టికి ఆఫర్లే రాకుండా పోయాయి. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ మరియు మలయాళ సినీ ఇండస్ట్రీకి కృతి షిప్ట్ అయ్యింది.
తమిళంలో ఈమె నటిస్తున్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. మరో వైపు మలయాళంలో కూడా ఒక సినిమాను చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ... తన కెరీర్ ఆరంభంలోనే సక్సెస్ చూశాను. అయితే ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం నాది కాదనే విషయం తెలుసు. అలాగే ఫ్లాప్ పడ్డప్పుడు మొత్తం బాధ్యత నాది కాదు అనుకుంటాను. నా పని నేను చేసుకుంటూ, నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసే విధంగా నటిస్తాను. ఈ క్రమంలో నాకు రావాల్సిన గుర్తింపు వస్తుందని భావిస్తాను అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది.
నా కెరీర్ ఆరంభంలో నాకు దక్కిన ఉప్పెన సక్సెస్ చూసి కొందరు అసూయ పడ్డారు. వారు నేను ఫెయిల్ అయితే, నాకు ఫ్లాప్స్ పడితే చూడాలి అనుకున్నారు అంది. వారు ఎవరు అని అడిగితే మాత్రం కృతి నుంచి సమాధానం రాలేదు. కృతి ఒక్క హిట్ తో టాలీవుడ్ లో చాలా ఆఫర్లు సొంతం చేసుకుంది. అయితే స్టార్ హీరోయిన్స్ కి పోటీగా మాత్రం ఆ సమయంలో కృతి ఎదగలేదు అని చెప్పాలి. కనుక ఎవరు కృతి ఫ్లాప్స్ ను కోరుకుంటారు... ఎవరు ఆమె ను టాలీవుడ్ నుంచి పంపాలి అనుకుంటారు అనేది చర్చగా మారింది. ఈ విషయమై కృతి శెట్టి క్లారిటీ ఇవ్వాల్సిందే అంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో ఉండే కృతి శెట్టి ఈసారి ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచింది. ముందు ముందు కృతి శెట్టి ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతానికి తమిళ్, మలయాళంలో సినిమాలు చేస్తున్న కృతి శెట్టి టాలీవుడ్ లో సినిమాలు మళ్లీ చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అంతే తప్ప ఎవరు కూడా బేబమ్మ ను వద్దనుకునే వాళ్ళు లేరు, ఆమె ఫ్లాప్స్ ను కోరుకునే వారు లేరు అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.