సహారా కప్ కొట్టడంతోనే సారాగా!
ఆ సంగతి పక్కనబెడితే సారా టెండూల్కర్ కి సారా పేరు ఎలా వచ్చిందో తెలిస్తే సర్ ప్రైజ్ అవ్వాల్సిందే.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో సారాకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండియా క్రికెట్ మ్యాచులు ఆడుతుంటే అక్కడ అమ్మడు ప్రత్యక్షం అవుతుంది. టీమ్ ని దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తుంది. అభిమాన క్రికెటర్ గిల్ ఉన్నాడంటే సారా మనసు ఇంకా పుల్లకించిపోతుంది. గిల్ తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఆ సంగతి పక్కనబెడితే సారా టెండూల్కర్ కి సారా పేరు ఎలా వచ్చిందో తెలిస్తే సర్ ప్రైజ్ అవ్వాల్సిందే. ఈ విషయాన్ని సారా స్వయంగా రివీల్ చేసింది. 1997 లో సచిన్ కెప్టెన్సీ లో ఇండియా సహారా కప్ ను గెలుచుకుంది. ఆ విజయం సచిన్ కి ఎంతో సంతోషాన్నిచ్చింది. వరుస పరాజయాలతో ఉన్న ఇండియాకి అది ఎంతో ఊరటని కూడా అందించింది. అయితే అదే సమయంలో సచిన్ కి కుమార్తె పుట్టింది.
దీంతో ఏ పేరు పెట్టాలని ఇంట్లో వాళ్లు అంతా ఆలోచిస్తోన్న సమయంలో కప్ వచ్చిన సందర్భంలో అదే పేరు సహారా అని పెడదామని డిసైడ్ అయ్యారుట. అయితే సారా తల్లికి మూడు అక్షరాల పేరు కంటే రెండు అక్షరాల్లో ఉంటే బాగుంటుందని భావించి సహారాని కాస్తా సారాగా మార్చినట్లు వెల్లడించింది. అప్పటి నుంచి ఇంట్లో అంతా సారాగా పిలవడం మొదలు పెట్టారని తెలిపింది.
అయితే సారా మీద అమ్మ, అమ్మమ్మల ప్రభావం ఎక్కువ అంటోంది. చిన్నప్పటి నుంచే అమ్మమ్మ నడిపే చారిటీలకు , అనాధ శ్రయాలకు సారా వెంట వెళ్లేదట. సారా వెళ్లిన ప్రతీసారి అనాధలకు ప్రత్యేకమైన స్వీట్లు పంచేదట. అలా చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అలవాటు అయ్యాయని సారి తెలిపింది. సారా సొంతంగా చారిటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.