Buy 1 టికెట్ Get 1 టికెట్ ఫ్రీ... రకుల్ సినిమా పరిస్థితి!
మేరే హస్బెండ్ కీ బివి సినిమా వైపు ప్రేక్షకులను ఆకర్షించేందుకు గాను మేకర్స్ వినూత్న ప్రయోగానికి తెర లేపారు.
అర్జున్ కపూర్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, భూమి పడ్నేకర్ హీరోయిన్స్‌గా రూపొందిన 'మేరే హస్బెండ్ కీ బివి' ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్య కాలంలో హిందీ నుంచి వస్తున్న సినిమాలకు జనాల నుంచి ఆధరణ కనిపించడం లేదు. ఛావా వంటి సినిమాకు సైతం మొదట్లో పెద్దగా ప్రేక్షకుల నుంచి స్పందన దక్కలేదు. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఛావా సినిమా జోరు ఒక వైపు కొనసాగుతున్న సమయంలో మేరే హస్బెండ్ కీ బివి సినిమాకు ప్రేక్షకుల నుంచి ఏమేరకు ఆదరణ లభిస్తుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మేరే హస్బెండ్ కీ బివి సినిమా వైపు ప్రేక్షకులను ఆకర్షించేందుకు గాను మేకర్స్ వినూత్న ప్రయోగానికి తెర లేపారు. కొన్ని ఎంపిక చేసిన థియేటర్‌లలో ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అంటూ అధికారికంగా ప్రకటన చేసింది. ఈమధ్య కాలంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తూ సినిమాల వైపు ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు అనే విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. అందులో కొన్ని మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.
సినిమా విడుదలైన మొదటి రోజు కొన్ని స్క్రీన్స్‌లో ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీగా ఇవ్వనున్నారు. సినిమా వినోదాత్మకంగా ఉంటుందని పోస్టర్స్‌ను చూస్తే అర్థం అవుతుంది. హీరో ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే సీన్స్ సినిమాలో ఉండబోతున్నాయి. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు హిట్ అయితే భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ పాత చింతకాయ పచ్చడి రొటీన్ ఫార్ములా సినిమా ఎంతవరకు వర్కౌట్ అయ్యేను అనేది చూడాలి. ఛావా వంటి సూపర్ హిట్ సినిమా ఉన్న సమయంలో ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా నిలవడం అనేది కష్టమే.
ఈ సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఆశలు పెట్టుకుని ఫలితం కోసం ఎదురు చూస్తుంది. బాలీవుడ్‌లో ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో ఆఫర్లు చాలానే వచ్చినా ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. కనుక ఈ సినిమా అయినా హిట్ అయితే మరికొన్నాళ్ల పాటు బాలీవుడ్‌లో కంటిన్యూ అవ్వచ్చు అని రకుల్ చాలా నమ్మకంగా ఉంది. అర్జున్ కపూర్ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఆయనకు కూడా ఈ సినిమా విజయం అత్యంత కీలకం. అందుకే ఈ సినిమాను సాధ్యం అయినంత ఎక్కువగా పబ్లిసిటీ చేస్తూ జనాల మధ్యకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.