శివాజీ బయోపిక్.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు?
ఇలాంటి టైమ్ లో శివాజీ 395వ జయంతని పురస్కరించుకుని ఫిబ్రవరి 19న ది ప్రైడ్ ఆఫ్ భారత్ః ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీని అనౌన్స్ చేస్తూ ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఛత్రపతి శివాజీ కొడుకు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఇలాంటి టైమ్ లో శివాజీ 395వ జయంతని పురస్కరించుకుని ఫిబ్రవరి 19న ది ప్రైడ్ ఆఫ్ భారత్ః ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీని అనౌన్స్ చేస్తూ ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో మరాఠా రూలర్ శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే శివాజీగా రిషబ్ శెట్టి భలే సూటయ్యాడనిపిస్తుంది. శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు శివాజీగా రిషబ్ శెట్టి నటిస్తుండటంతో ఆ బజ్ ఇంకాస్త పెరిగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నటుడు ది ప్రైడ్ ఆఫ్ భారత్ లో కీలక పాత్రలో నటించనున్నాడని అంటున్నారు. ఇంకా ఈ విషయం చర్చల దగ్గరే ఉందని, పూర్తి స్థాయి డిస్కషన్స్ జరిగాక ఆ నటుడెవరనేది రివీల్ కానున్నట్టు తెలుస్తోంది.
2027న జనవరి 21న ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే ఈ సినిమా చేయడంపై రిషబ్ శెట్టి ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. శివాజీ యోధుడు మాత్రమే కాదని, స్వరాజ్యానికి ఆయన ఆత్మ లాంటి వాడని, అతని అసమాన వారసత్వానికి తెరపై న్యాయం చేస్తానని ఆశిస్తున్నట్టు తెలిపాడు.
అయితే రీసెంట్ గా ఛత్రపతి శివాజీ కొడుకు కథగా వచ్చిన చావా మూవీనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటే ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఊహకి కూడా అందడం లేదు. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేతిలో కాంతారకి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్1 తో పాటూ జై హనుమాన్ సినిమాలు కూడా ఉన్నాయి.