స్టార్ హీరోయిన్‌కి చిన్న‌ప్పుడే ప్ర‌పోజ్ చేసాడు

బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ సౌత్ లోను న‌టిస్తున్నాడు. కేజీఎఫ్ 2లో అధీరా పాత్ర సంజూ కెరీర్ కి గేమ్ ఛేంజ‌ర్ గా మారింది.

Update: 2024-12-29 21:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ సౌత్ లోను న‌టిస్తున్నాడు. కేజీఎఫ్ 2లో అధీరా పాత్ర సంజూ కెరీర్ కి గేమ్ ఛేంజ‌ర్ గా మారింది. ఆ త‌ర్వాత‌ లియో, డ‌బుల్ ఇస్మార్ట్ లాంటి సౌత్ సినిమాల్లో న‌టించాడు. ఇవ‌న్నీ పాన్ ఇండియ‌న్ రేంజులో విడుద‌ల‌య్యాయి. అటు బాలీవుడ్ తో పాటు ద‌క్షిణాదినా అత‌డి హ‌వా కొన‌సాగుతోంది.

65 వ‌య‌సులోను సంజ‌య్ ద‌త్ హార్డ్ వ‌ర్క్ తో ఆక‌ర్షిస్తున్నాడు. అయితే అత‌డి చిన్న‌ప్ప‌టి అల్ల‌రి అంతా ఇంతా కాదు. చాలా చిన్న వ‌య‌సులో ఉండ‌గానే వెట‌రన్ స్టార్ సైరా భానుకి పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌పోజ్ చేసాడ‌ట‌. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ న‌టి స్వ‌యంగా ఓ వేదిక‌పై వివ‌రించారు. ద‌త్ కుటుంబంతో అత్యంత స‌న్నిహితంగా ఉండే సైరా భాను సంజూపై త‌న‌కు ఉన్న‌ ప్రేమాభిమానాల‌ను చాటుకున్నారు. దివంగత భర్త దిలీప్ కుమార్ గురించి ప్రస్థావిస్తూనే, సంజూ , అత‌డి త‌ల్లి గారైన న‌ర్గీస్ ద‌త్ తో త‌న అనుబంధం గురించి సైరా భాను రివీల్ చేసారు. అంతేకాదు.. చిన్నతనంలో సంజయ్ దత్ తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

సంజయ్ ఎప్పుడూ నా కుటుంబంలో వ్య‌క్తి.. మేం అతడి ఎదుగుద‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసాము అని సైరా భాను అన్నారు. ఒక పసిబిడ్డ ఈ రోజు గొప్ప వ్యక్తిగా మారాడ‌ని ఆనందం వ్య‌క్తం చేసారు. యువ సంజయ్‌, అత‌డి దివంగత తల్లి నర్గీస్ దత్‌తో ఉన్న మధురమైన జ్ఞాపకాలను మ‌ర్చిపోలేన‌ని సైరా భాను అన్నారు.

నర్గీస్ త‌మ ఇంటికి ఫంక్షన్లకు వ‌చ్చిన‌ప్ప‌టి ఘ‌ట‌న అది. నర్గీస్ ద‌త్ నాతో కరచాలనం చేసి `ఛలో, సైరా జీ కో బోలో తుమ్ క్యా!` అని చెప్పేది. ఆపై సంజు నా వైపు చూసి, `మైన్ శైలా బాను సే షాదీ కరుంగా` అని ముద్దులొలికే చిన్న గొంతుతో చెప్పేవాడు. నేను , షర్మిలా ఠాగూర్ సంజూకి న‌చ్చే అత్యంత ఇష్టమైన తార‌లం అని సైరా అన్నారు. నా హృదయంలో అతడికి ప్రత్యేక స్థానం ఉంది అని తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. రణవీర్ సింగ్ `డాన్ 3`లో సంజయ్ దత్ న‌టిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. మోస్ట్ అవైటెడ్ హౌస్‌ఫుల్ 5 లోను అత‌డు న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News