రాజమౌళి హీరోయిన్.. ఇప్పటికైనా బ్రేక్ దక్కేనా?

రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సలోనిని ఎవరూ అంత ఈజీగా మరిచిపోరు.

Update: 2024-10-27 13:30 GMT

రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సలోనిని ఎవరూ అంత ఈజీగా మరిచిపోరు. నిజానికి రాజమౌళి సినిమాలో నటించిన ప్రతి హీరోయిన్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది. కెరియర్ పరంగా చాలా సక్సెస్ లు అందుకున్నారు. అయితే ‘మర్యాద రామన్న’ సినిమాలో సునీల్ కి జోడీగా నటించిన సలోని మాత్రం ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. సుమంత్ ‘ధన్ 51’ మూవీతో సలోని హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఆ తరువాత తరుణ్ తో ‘ఒక ఊరిలో’ అనే సినిమా చేసింది. ఈ రెండు పెద్దగా సక్సెస్ కాలేదు. సిద్ధార్ధ్ కి జోడీగా ‘చుక్కల్లో చంద్రుడు’ మూవీలో కూడా సలోని నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత కన్నడ, తమిళ్ భాషలలో అవకాశాలు సొంతం చేసుకొని మూవీస్ చేసింది. అయితే రాజమౌళి ‘మర్యాద రామన్న’ సినిమాతో సలోని కమర్షియల్ బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో సలోనికి హీరోయిన్ గా అవకాశాలు పెరుగుతాయని అందరూ భావించారు.

అయితే కొన్ని చిన్న సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న పెద్దగా క్లిక్ కాలేదు. అయితే ‘బాడీగార్డ్’, ‘రేసుగుర్రం’ సినిమాలలో ఆమెకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే లభించాయి. ఈ బ్యూటీ కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిన బిజీ అవుదామని ప్రయత్నం చేసిన పెద్ద సినిమాలలో ఛాన్స్ లు రావడం లేదు. చిన్న సినిమాలు చేసిన గుర్తింపు దక్కడం కష్టం అయిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘మట్కా’ చిత్రంలో ఇంటరెస్టింగ్ రోల్ ని ఆమె సొంతం చేసుకుంది.

పద్మ అనే క్యారెక్టర్ లో సలోని ఈ చిత్రంలో కనిపిస్తోంది. చాలా నేచురల్ లుక్ లో ఆమె పాత్ర ఉండబోతోందని తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. ‘మట్కా’ మూవీ హిట్ అయితే కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తెలుగులో మళ్ళీ బిజీ అవుతానని అనుకుంటుంది. మరి ఈ బ్యూటీ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయనేది వేచి చూడాలి.

నవంబర్ 14న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ప్రిన్స్ వరుజ్ తేజ్ ఈ చిత్రంలో ‘మట్కా’ కింగ్ గా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

Tags:    

Similar News