హీరోయిన్ కు సావిత్రమ్మ చెప్పిన సినిమా పాఠాలు..

అలానే అప్పటి యువ హీరోయిన్ దీపకు సావిత్రమ్మ ఇచ్చిన చిన్నపాటి డోసు గురించి ఈరోజు తెలుసుకుందాం.

Update: 2024-09-28 03:49 GMT

వెండితెర మీద మహానటి సావిత్రమ్మ చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణ పాత్రకు తన అసాధారణ నటనతో సినిమా రేంజ్ పెంచుతారు ఆమె. అందుకే ఆమెను మహానటిగా ప్రేక్షకులు తమ హృదయాల్లో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఐతే సావిత్రి గారికి సినిమా అంటే ఒక గౌరవం. సెట్ లో ఎవరైనా సినిమాను కాస్త తక్కువ చేస్తే ఆమెకు కోపం వచ్చేది. అలానే అప్పటి యువ హీరోయిన్ దీపకు సావిత్రమ్మ ఇచ్చిన చిన్నపాటి డోసు గురించి ఈరోజు తెలుసుకుందాం.

రామవిజేతా వారి ప్రొడక్షన్ లో డైరెక్టర్ బాబూరావు సినిమా జరుగుతుంది. అప్పుడే యువ నటి దీపను సావిత్రమ్మకు ఆయన పరిచయం చేశారు. అప్పుడు సావిత్రి గారు మంచి పాత్రలు చేస్తున్నావా అమ్మాయ్ అని దీపని అడిగారు. దానికి సమాధానంగా దీప కనురెప్పలు ఆర్పుతూ తెలుగు, మలయాళం, తమిళమే కాదు హిందీ సినిమాల్లో కూడా బుక్ అయ్యానండీ అంది. అప్పుడు సావిత్రమ్మ నటికి బాష కాదు ముఖ్యం ఏ క్యారెక్టర్లు చేస్తున్నామన్నది ముఖ్యమని అన్నారు.

తెలుగు, తమిళ చిత్రాల్లో చీర కొంగు ఎడమవైపు నుంచి కుడిభుజం మీద ఉంటుంది. అదే హిందీ సినిమాలైతే ఒక్కోసారి కుడివైపు నుంచి ఎడమ భుజం మీద వేసుకోవాలి. ఇక మళయాళం అయితే అసలు కొంగే అక్కర్లేదు. బాష, కాస్టూమ్స్ కాదు ప్రతిభ చూపడానికి తగిన పాత్రలు రావాలని అన్నారు సావిత్రి. ఆ తర్వాత ఇద్దరు షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ నెక్స్ట్ డే దీప షూటింగ్ కు లేట్ గా రావడంతో కోప్పడ్డ సావిత్రమ్మ ఏంటమ్మా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చావ్ షూటింగ్ కు ఆలస్యంగా వస్తే ఎలా అన్నారట.

ఒకప్పుడు నేను కూడా బిజీ హీరోయినే.. కానీ నా కోసం సెట్ లో ఎవరూ వెయిట్ చేయించేదాన్ని కాదని అన్నారట. అందుకు దీప అమ్మ మీరు పాతకాలంలోనే ఉన్నారు. ఈరోజు నేను ఎన్నో సినిమాలు చేస్తున్నా మూడు షిఫ్ట్ లు జరుగుతున్నాయి. ఉదయం నుంచి తలనొప్పి వల్లే లేట్ గా వచ్చానని అన్నదట. మీరు సీనియర్ కాబట్టి సంజాయిషీ ఇస్తున్నా అంటూ దీప అన్నది. అప్పుడు సావిత్రమ్మ ఓహో షూటింగ్ ఎగొట్టేద్దామనుకున్నావా ఇంట్లో ఎందుకు ఇక్కడే రెస్ట్ తీసుకో ఎలాగు ఈరోజు నీ సీన్ జబ్బున పడి మంచమెక్కే సీన్ కదా సెట్ లో మంచం రెడీగా ఉని నీరసంగా పడుకో న్యాచురల్ ఎఫెక్ట్ బాగుంటుందని అన్నారట. సావిత్రమ్మ అలా అనడంతో దీప వెంటనే షాట్ కు రెడీ అయ్యేందుకు వెళ్లారట.

మనకు వచ్చిన అవకాశాలను మనం ఎంత జాగ్రత్త పడాలో అప్పట్లో సావిత్రి గారు తన తోటి నటీమణులకు చెబుతూ ఉన్నారని తెలుస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఆమె జీవితంలో ఉన్నాయి.

Tags:    

Similar News