తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో అదాశర్మ
అదా శర్మ కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. పరిస్థితి క్షీణించడంతో బుధవారం ఉదయం ఆసుపత్రికి తరలించారు.
ది కేరళ స్టోరీలో అద్భుత నటనతో సత్తా చాటింది అదా శర్మ. చాలా కాలానికి తన ఎదురు చూపులు ఫలించాయి. దక్షిణాది ఉత్తరాది అనే విభేధమే లేకుండా అన్నిచోట్లా తనకు గొప్ప గుర్తింపు తెచ్చింది ఈ చిత్రం. అదాశర్మ ఇప్పుడు బిజీ కథానాయిక. క్షణం తీరిక లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది.
ప్రస్తుతం 'కమెండో' ఓటీటీ సిరీస్ విడుదలకు ముందు అదాశర్మ సెట్లో తీవ్ర అనారోగ్యం పాలైంది. ది ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రకారం ... అదా శర్మ కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. పరిస్థితి క్షీణించడంతో బుధవారం ఉదయం ఆసుపత్రికి తరలించారు.
ఇంతకీ ఏం జరిగింది? అంటే.. అదా తీవ్ర అనారోగ్యం పాలైందని తెలిసింది. ''ఉదయం బాగా వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. వెంటనే ఆమెకు తీవ్రమైన విరేచనాలు అయ్యాయి. ఆహార అలెర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇప్పుడు ఆస్పత్రిలో వైద్యుల పరిశీలనలో ఉంది'' అని తెలిసింది. అయితే అదాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఫుడ్ పాయిజన్ అయిందని చెబుతున్నారు.
కమెండో సిరీస్ గురించి..కమెండో సిరీస్‌లో భావనా రెడ్డి పాత్రలో అదా శర్మ నటిస్తోంది. ఈ సిరీస్‌లో ప్రేమ్‌తో కలిసి అదా నటించనుంది. ఈ చిత్రాన్ని సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృతలాల్ షా నిర్మిస్తున్నారు.
ఈ ఫిల్మ్ సిరీస్‌ను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ-నిర్మాణం చేస్తూనే పంపిణీ చేస్తుంది. అదా ఒకసారి మీడియా పోర్టల్‌తో కమాండో సిరీస్‌లో తన పాత్ర గురించి మాట్లాడింది. కమెండో హాట్ స్టార్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది.
''కమెండో 2 .. కమెండో 3లో నేను భావనా రెడ్డిగా నటిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ కమాండో తయారవుతుందో అక్కడ భావనా రెడ్డి కొన్ని సెకన్ల పాటు ఉంటుంది. అక్కడ ఉండేలా చూస్తుంది! భావన వెంటనే కనెక్ట్ అవుతుంది..'' అని వెల్లడించింది. ఈ సిరీస్‌లో అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, శ్రేయ చౌదరి, మణిని చద్దా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అదా శర్మ చివరిసారిగా సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీలో కనిపించింది.