నా ఏడుపుకి కారణం మీరు కాదు - అనసూయ
యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం యాక్టర్ గా స్టార్ ఇమేజ్ ని ఆశ్వాదిస్తున్న నటి అనసూయ.
యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం యాక్టర్ గా స్టార్ ఇమేజ్ ని ఆశ్వాదిస్తున్న నటి అనసూయ. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఈ బ్యూటీ ఫుల్ రైజింగ్ లో ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళీ భాషలలో కూడా మూవీస్ చేస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఉంటారు.
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లతో పాటు ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైంని కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తారు. సోషల్ మీడియాలో అనసూయని అభిమానించేవారు ఎంత మంది ఉంటారో, అలాగే ద్వేషించే వారు కూడా ఉంటారు. నిత్యం ఆమె మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ ట్రోలింగ్ హద్దులు దాటిపోతుంది కూడా. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ తాను ఏడుస్తున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.
దానిపై సుదీర్ఘమైన పోస్ట్ రాసింది. అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కారణంగానే ఆమె ఏడుస్తుందని అర్ధం చేసుకున్నారు. ముఖ్యంగా పోస్ట్ మొత్తం సోషల్ మీడియాలో తన పెర్సనల్ లైఫ్ లో జర్నీ గురించి ప్రస్తావించడం అందరికి అదే రీతిలో అర్ధమైంది. ఇలా ఏడుస్తూ వీడియో తీసుకొని పోస్ట్ చేయడంపై కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
తరువాత ఈ వీడియోపై అనసూయ వివరణ ఇచ్చింది. తాను సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోలింగ్ గురించి ఏడవలేదని, లైఫ్ లో కఠినమైన నిర్ణయం ఒకటి తీసుకోవాల్సివచ్చిందని, దానికోసం ఆ క్షణం ఏడ్చినట్లు పేర్కొంది. అలాగే ఐదు రోజుల క్రితం తన ఎమోషన్ ని పంచుకోవాలని తీసిన వీడియోగా చెప్పింది. అది జరిగిన తర్వాత మరల నేను పార్లర్ కి వెళ్లి చక్కగా ఫీషియల్ చేయించుకొని హ్యాపీగా తిరిగి వచ్చానని చెప్పింది.
ఏడవడంపై వివరణ కోసం మరో రెండు వీడియోలని అనసూయ పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం విశేషం. అయితే ఆమె ని వ్యతిరేకించే వారు వీటిని కూడా ట్రోల్ చేస్తారనే సంగతి తెలిసిందే. అభిమానించే వారు మాత్రం అనసూయకి సపోర్ట్ గా నిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు.