సీతమ్మ ఆఫ్ సెంచరీ కొట్టేసింది!
అటుపై ప్రేమ లేఖ రాసా అనే మరో చిత్రం చేసింది. కానీ అంజలి సక్సెస్ అయ్యే వరకూ ఈ సినిమాల్లో నటించింది అన్న సంగతి ఎవరికీ తెలియదు.
తెలుగు హీరోయిన్ అంజలి జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వకపోయినా కోలీవుడ్ లో నటిగా నిరూపించుకుని తెలుగులో అవకాశాలు అందుకుని సత్తా చాటిన నటి. తెలుగు నటులకు తెలుగు వారు అవకాశాలు ఇవ్వరు అన్న విమర్శని అంజలి సక్సెస్ తో తిప్పి కొట్టింది. టాలీవుడ్లో అమ్మడి జర్నీ ఫోటోతో మొదలైంది. అటుపై ప్రేమ లేఖ రాసా అనే మరో చిత్రం చేసింది. కానీ అంజలి సక్సెస్ అయ్యే వరకూ ఈ సినిమాల్లో నటించింది అన్న సంగతి ఎవరికీ తెలియదు.
అంజలి సక్సెస్ తోనే ఆ సినిమాలకు ఓ ఐడెంటిటీ వచ్చింది. `కట్రదు తమిళ్` సినిమాతో అమ్మడు కోలీవుడ్ లో లాంచ్ అయింది. తొలి సినిమా అక్కడ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత అంజలి కోలీవుడ్ కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోయింది. అక్కడ వచ్చిన గుర్తింపుతోనే తెలుగులోనూ అవకాశాలు అందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో అమ్మడు మళ్లీ ఇక్కడ కంబ్యాక్ అయింది.
ఆ సినిమా విజయంతో అమ్మడికి ఇక్కడా అవకాశాలు ఊపందుకున్నాయి. `గీతాంజలి` సినిమాతో లేడీ ఓరియేంటెడ్ భామగా నిరూపించుకుంది. అప్పటి నుంచి తెలుగు, తమిళ్ రెండు భాషల్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తోంది. మసాలా, బలుపు , డిక్టేటర్, వకీల్ సాబ్ లాంటి ఎన్నో సినిమాలు చేసింది. వాటిలో కొన్ని సినిమాల్లో సెకెండ్ లీడ్ పోషించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
అయినా కోలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు అయితే టాలీవుడ్ లో రాలేదు. కానీ అమ్మడు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. అలా ఇప్పటివరకూ రెండు భాషల్లో కలిపి 49 సినిమాలు దిగ్విజయంగా పూర్తి చేసింది. తాజాగా తమిళ్ లో `ఈగై` అనే సినిమా చేస్తోంది. ఇది అమ్మడికి 50వ సినిమా కావడం విశేషం. ఇది కూడా లేడీ ఓరియేంటెడ్ చిత్రం అవ్వడం ఆమె అభిమానుల్ని మరింత ఉత్సాహ పరుస్తుంది. ఇదంతా అంజలి రెండు దశాబ్ధాల ప్రయాణం.