అనుష్క రెమ్యునరేషన్.. ఓ పద్ధతిలోనే..
కెరీర్ ముదటి నుంచి గమనిస్తే ఆమె గ్లామర్ రోల్స్ తో పాటు కంటెంట్ ఉన్న ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది
సౌత్ ఇండియా సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. నాయికా ప్రాధాన్య చిత్రాలకు కొత్త ఊపిరి పోసింది. ఎంతోమంది కథానాయికలకు స్ఫూర్తిగా నిలిచింది.
కెరీర్ ముదటి నుంచి గమనిస్తే ఆమె గ్లామర్ రోల్స్ తో పాటు కంటెంట్ ఉన్న ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మరి ఈ రేంజ్ స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్స్.. ఎంచుకునే సినిమాలు గానీ, తీసుకునే రెమ్యునరేషన్ ఎంతటి స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద చిత్రాల్లోనే నటిస్తూ.. కోట్లలోనే అందుకుంటారు.
కానీ అనుష్క అలా కాదు. తన స్టార్ డమ్ ను పక్కనపెట్టి.. నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని సినిమా బడ్జెట్, కంటెంట్ పరంగా పారితోషికాన్ని తీసుకునేందుకు రెడీ అయినట్లు అర్థమవుతోంది. అలాగే సినిమా పెద్దగా చిన్నదా అని తేడా చూడకుండా కంటెంట్ ఉంటే చాలు చిన్న చిత్రంలోనైనా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బహుశ చాలా కాలం తర్వాత రానుండటం కూడా ఓ కారణం అయి ఉండొచ్చు. తాజాగా ఆమె చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు గానూ ఆమె రూ.6కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుందని ఆ మధ్య ప్రచారం సాగింది.
అయితే అనుష్క ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇవి చేసేది తెలుగులో కాదు మలయాళంలో. కథనార్ అనే పీరియాడికల్ ఫిక్షనల్ యాక్షన్ అండ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ చేయబోతుంది. ఈ చిత్రంతోనే ఆమె మలయాళంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సినిమాను ఆమె కొన్ని నెలల ముందే ఒప్పుకుందట. దీంతో పాటే మరో మలయాళ సినిమా కూడా చేస్తోంది. ఒట్టకొంబన్ అనే చిత్రం కూడా ఒప్పకుంది.
ఈ చిత్రాలకు అనుష్క తీసుకోబోయే రెమ్యునరేషన్ వివరాలు తెలిశాయి. ఆమె తన రేంజ్ కన్నా తక్కువగా.. రూ. 5 కోట్ల కంటే తక్కువగా తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. అంటే దీని బట్టి ఆమె కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలైనా.. తక్కువ పారితోషికంతోనే నటించేందుకు ఆసక్తి చూపుతోందని అర్థమవుతోంది. చూడాలి ఆమె ఇంకా ఎలాంటి చిత్రాలను ఒప్పుకుంటుందో..