అనుష్క.. మళ్ళీ కష్టపడక తప్పట్లేదు!

ప్రస్తుతం ఈ అమ్మడు ఫిట్ నెస్ పైన పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిందంట. సన్నబడే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది.

Update: 2023-09-17 15:30 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథతో పాన్ ఇండియా మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి అంజి తర్వాత మరల అలాంటి కథాంశం రాబోతోంది. బింబిసారాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ట ఈ చిత్రాన్ని అదే స్థాయిలో డీల్ చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా బయటకి రాకున్నా సినిమాలో చిరంజీవికి పెయిర్ గా చేయడానికి ఈ స్వీటీ ఒకే చెప్పిందంట. యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కుతోన్న సినిమా కావడం, వారతో ఉన్న అనుబంధం రీత్యా అనుష్క చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట.

యూవీ క్రియేషన్స్ లోనే తాజాగా అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కి అనుష్క దూరంగా ఉంది. మీడియాకి కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఫిట్ నెస్ పైన పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిందంట. సన్నబడే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది. అందుకే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదని టాక్.

త్వరలో సరికొత్త లుక్ తో అభిమానులని, రెగ్యులర్ సినీ ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి అనుష్క రాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే మలయాళంలో ఓ పాన్ ఇండియా సినిమాకి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అలాగే తమిళంలో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యిందంట.

ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిత్రంలో కూడా అనుష్క ఫుల్ స్లిమ్ లుక్ లో దర్శనం ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. సైజ్ జీరో మూవీ కోసం అనుష్క ముందుగా లావైంది. తరువాత కొంత తగ్గిన మరల బాహుబలిలో దేవసేన పాత్రకి కూడా కొంత లావుగా కనిపించింది. నెక్స్ట్ నిశ్శబ్దం, భాగమతి సినిమాలలో కొంత లావుగానే కనిపించింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీలో కొంత సన్నబడినట్లు కనిపించిన ఇంకా తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News