గ్లామర్ గా కనిపించేందుకు ఓకే.. కానీ!
పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా రూపొందిన సార్పట్టా పరంపరై సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ దుషారా
పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా రూపొందిన 'సార్పట్టా పరంపరై' సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ దుషారా. సాధారణంగా తమిళనాట రాజకీయ ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోలు ఉన్నారు కానీ... హీరోయిన్ లు మాత్రం లేరు. ఆ లోటును దుషారా తీర్చింది.
రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ను దక్కించుకోగలదా... అసలు ఆఫర్లు దక్కించుకునేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మొదటి సినిమా సార్పట్టా సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది.
తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ కి జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఫ్యామిలీ పాత్రల్లోనే కాకుండా గ్లామర్ రోల్స్ ను చేయడానికి... కమర్షియల్ పాత్రల్లో కనిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా హీరోయిన్ దుషారా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
వల్గర్ గా నటించడం వేరు.. అందంగా కనిపించడం వేరు అన్నట్లుగా ముద్దుగుమ్మ దుషారా చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా తాను ఎలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. సినిమాల్లో అయిదు నిమిషాల పాత్ర అయినా కూడా ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్పకుండా నటిస్తాను అంది.
గ్లామర్ గా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను. అయితే గ్లామర్ షో కు తాను సిద్ధమే కానీ ఒక హద్దు అంటూ ఉంటుందని ఆమె పేర్కొంది. గ్లామర్ షో కు ఉన్న ఆ హద్దు తనకు తెలుసు అని... ఆ పరిధిలో అందంగా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అందంగా కనిపించేంత వరకు ఓకే కానీ అశ్లీలంగా కనిపించేందుకు మాత్రం తాను ఆసక్తి చూపించనంటూ చెప్పుకొచ్చింది.