యంగ్ హీరోకి అతడు లిప్ట్ ఇస్తున్నాడా?
'ది అర్చీస్' తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వేదాంగ్ రైనా చేసింది రెండు సినిమాలే అయినా? మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
'ది అర్చీస్' తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వేదాంగ్ రైనా చేసింది రెండు సినిమాలే అయినా? మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ది అర్చీస్ లో నెపో కిడ్స్ తో పోటీ పడి నటించాడు. అందులో నటించిన వారంతా స్టార్ కిడ్స్. కానీ వేదాంగ్ మాత్రం ఔట్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించడంలో వేదాంగ్ సక్సెస్ అయ్యాడు. తన పాత్ర వరకూ పేరు పెట్టకుండా నటించాడు. అటుపై `జిగ్రా` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
కానీ ఈసినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ సినిమా విజయం సాధించి ఉంటే వేదాంగ్ కెరీర్ మరోలా ఉండేది. అయినా సరే వేదాంగ్ ని రణవీర్ సింగ్ లాంటి నటుడితో ప్రేక్షకులు పోల్చడం అన్నది ఎంతో గొప్ప విషయం. `జిగ్రా` తర్వాత ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో `వేదాంగ్` కోసం బాలీవుడ్ స్టార్ మేకర్ ఇంతియాజ్ అలీ రంగంలోకి దిగారు. వేదాంగ్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.
ఇందులో వేదాంగ్ కి జోడీగా అనన్యా పాండేతో చర్చలు జరుపుతున్నారు. అనన్యపై లుక్ టెస్ట్ కూడా చేసారు. ఇందులో ఆమె పాస్ అయినట్లు తెలుస్తుంది. మునుపటి కంటే అనన్య మరింతగా షైన్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే అనన్య నటించిన `సీటీఆర్ ఎల్`, `కాలీ మే బే` చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. దీంతో అనన్య మార్కెట్ కూడా మెరుగు పడింది. దీంతో అమ్మడిని వేదాంగ్ రైనాకి పర్పెక్ట్ జోడీగా ఇంతియాజ్ భావిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఈ జోడీ జత కట్టలేదు. అనన్యా పాండే చాలా సినిమాలు చేసింది. నటిగా వేదాంగ్ రైనా కంటే సీనియర్. యంగ్ హీరోలతో నటించిన అనుభవం ఉంది. క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా ఇంతియాజ్ కి మంచి పేరుంది. అతడి చివరి సినిమా `అమర్ సింగ్ చమ్కీలా` కూడా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రాజెక్ట్ హీరోగా వేదాంగ్ రైనాని ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.