రూ.263 కోట్ల స్కాం... బిగ్ బాస్ ఫేం భామ గురించి తెలుసుకోవాల్సిందే!
ప్రస్తుత్రం స్కాం ల సీజన్ నడుస్తున్నట్లుంది! ఇందులో ఏ స్కాం బయటకు వచ్చినా అది దేశవ్యాప్తంగా సంచలనంగానే మారుతుంది
ప్రస్తుత్రం స్కాం ల సీజన్ నడుస్తున్నట్లుంది! ఇందులో ఏ స్కాం బయటకు వచ్చినా అది దేశవ్యాప్తంగా సంచలనంగానే మారుతుంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాగా.. ఇప్పుడు ఏపీ ఎక్స్ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో రూ.264కోట్ల స్కాం, అందులో బిగ్ బాస్ ఫేం భామ పేరు ఉండటం వైరల్ అవుతుంది.
అవును... రూ.264కోట్ల మనీలాండరింగ్ స్కాం కేసులో తాజాగా బిగ్ బాస్ ఫేం, బాలీవుడ్ బ్యూటీ కృతి వర్మ పేరును చేర్చారు అధికారులో. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ కేసులోని ప్రధాన నిందితుడితో సంబంధాలు ఉండడంతో ప్రస్తుతం కృతి వర్మను ఈడీ అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారని తెలుస్తుంది.
తాజాగా రూ.264కోట్ల టీడీఎస్ స్కాం కేసులో సుమారు డజను మంది నిందితుల వివరాలను బయటపెట్టారు ఈడీ అధికారులు. ఈ సమయంలో భూషణ్ పాటిల్, రాజేష్ శెట్టి సహా పలువురు నిందితులతో కృతి వర్మకు సంబంధం ఉన్నట్లు ఈడీ చార్జిషీట్ లో పేర్కొంది. ఇదే సమయంలో ఇప్పటికే ఆమె బ్యాంక్ ఖాతాలను స్థంభింపచేసింది ఈడీ.
ఈ కేసులో కేసులో మొత్తం 12 మోసపూరిత టీడీఎస్ రీఫండ్ ల కింద సుమారు రూ.264కోట్ల సొమ్మును అక్రమంగా తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలుస్తుంది. ఇందులో రూ.69 కోట్లతో మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఈమె కొన్న స్థిర, చరాస్తులను ఈడీ గత నెలలో అటాచ్ చేసింది! దీంతో ఈమె పాత్ర కీలకమైనదే అని గుర్తించిన అధికారులు... ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు!
కాగా... ఢిల్లీకి చెందిన కృతి వర్మ.. 2007- 2009 మధ్య కాలంలో సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ అధికారిగా పనిచేశారు. ఈ క్రమంలో నటనపై ఉన్న ఆసక్తి కారణంగా తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ముంబైకి వచ్చి రోడీస్ ఎక్స్‌ట్రీమ్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్-12లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అప్పుడు ఈమె బాగా పాపులర్ అయ్యారు!
ఇదిలావుండగా... తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని కృతి వర్మ చెబుతుంది. గతంలో ఓ పాటలో భూషణ్ పాటిల్ తో కలిసి డ్యాన్స్ చేశానని, అందుకుగానూ తనకు రూ.కోటి పారితోషికం ఇచ్చారని చెప్పింది. అయితే కేసు గురించి తెలిసిన తర్వాత అతడికి దూరంగా ఉన్నట్లు తెలిపింది.