మీనాక్షి తల్లిని అవమానించిన గ్రామం
బ్యాక్ గ్రౌండ్ లేని నటీనటులకు ట్రెజడీ తప్పనిసరి. ఎదిగే క్రమంలో అవమనాలు..వెక్కిరింపులు తప్పవు.
బ్యాక్ గ్రౌండ్ లేని నటీనటులకు ట్రెజడీ తప్పనిసరి. ఎదిగే క్రమంలో అవమనాలు..వెక్కిరింపులు తప్పవు. అలాంటి ఎన్నో అవమానాల వెనుక సక్సెస్ ఉందని గుర్తించిన వాళ్లే సక్సెస్ అయిన వారంతా. ఇది సినిమా రంగంలోనే కాదు. అన్ని రంగాల్లో సపోర్ట్ లేకుండా ఎదిగిన వారి జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే..హీరోయిన్లగా రాణించాలని అనుకునే వారు లైంగిక వేధింపులు అదనంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే హరియానా బ్యూటీ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీకి రాకముందే స్వగ్రామంలోనే ఎన్నో అవమనాలు...హేళనలు చూసినట్తు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `మా నాన్న ఆర్మీలో పనిచేసేవారు. ఆయన అభిమాన నటి మీనాక్షి శేషాద్రి. అందుకే నాకు మీనాక్షి అని పేరు పెట్టారు.
నేను బీడీఎస్ థర్డ్ ఇయర్ లో ఉండగా నాన్న బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయారు. ఆ దిగులుతో చదువు పక్కనబెట్టడంతో అమ్మ బాధపడేది. బాధ నుంచి బయటకు రావాలని మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనమని అమ్మ చెప్పింది. తనే దరఖాస్తు చేసింది. నాన్న చనిపోయిన నెల రోజులకే అమ్మ అలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. మా ఊళ్లో వాళ్లు..అమ్మని..నన్ను అనరాని మాటలు అని అవమానించారు.బంధువులు మాట్లాడటం మానేసారు. మాదో వింత ఫ్యామిలీ అన్నట్లు చేసేవారు.
కానీ అవేవి పట్టించు కోకుండా అమ్మ నన్ను ప్రోత్సహించింది. నేను దైర్యాన్ని కోల్పోయినా అమ్మ మాత్రం నన్ను ధైర్యం చెప్పి ముందుకు పంపించింది. మాది హరియానాలోని పంచ్ కులానీ. అక్కడ జరిగిన ఏ సంఘటన మర్చిపో లేదు. ప్రతీది ఇప్పటికీ నా కళ్ల ముందు కదులుతుంది. నాన్న జ్ఞాపకాలు..ఊరి అవమానం ఇంకా అలాగే ఉన్నాయి. నటిగా సాధించాను..బీడీఎస్ పట్టా పొందాను. ఏదో ఒక సినిమాలో కలెక్టర్ పాత్ర పోషించి అది సాధించానని ఫీలైపోతా. అలాగే ఇంట్లో అమ్మతో పాటు ఉంటే వంట నేర్చుకుంటా. ఖాళీ గా ఉంటే పుస్తకాలు చదువుతా. స్నేహితులతో ఈత...బ్యాడ్మింటన్ ఆడుతా. నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే` అని అంది.