గెట్ రెడీ అంటోన్న హాట్ బ్యూటీ.. వ‌ర్కౌట్ అవుతుందా?

అంత‌కు ముందు.. ఆత‌ర్వాత డిస్కో రాజా..మాస్ట్రో..అల్లుడు అదుర్స్..బ్ర‌తుకే సో బెట‌ర్.. అదుగో లాంటి చిత్రాల్లో న‌టించింది

Update: 2023-08-29 06:16 GMT

హాట్ బ్యూటీగా న‌భా న‌టేష్ ఏడాదిగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. భుజానికి తీవ్ర‌మైన గాయ‌మ‌వ్వ‌డం స‌హా మ‌ల్టీ పుల్ బోన్ ప్రాక్చ‌ర్ కావ‌డంతో పాటు కొన్ని ర‌కాల కాంప్లికేటెడ్ స‌ర్జ‌రీలు కూడా జ‌రిగాయి. అమ్మ‌డి జీవితంలో అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదం ఇది. దీంతో శారీర‌కంగా..మాన‌సికంగా ఎంతో పెయిన్ అనుభ‌వంచింది. ఈ నేప‌థ్యంలో సినిమాల‌కు దూర‌మ‌వ్వాల్సి వ‌చ్చింది.

పూర్తిగా ఇంటికి ప‌రిమిత‌మై విశ్రాంతి తీసుకుంటుంది. అయితే ఇప్పుడా స‌మ‌స్య‌ని అధిగ‌మించి రెట్టించిన ఉత్సాహంతో మ‌ళ్లీ మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతోంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా రివీల్ చేసింది. లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ వారి వృత్తికి దూరంగా ఉన్నారు. కానీ నేను మాత్రం ఓ ప్ర‌మాదం కార‌ణంగా మొన్న‌టివ‌ర‌కూ లాక్ డౌన్ లోనే ఉన్నాను. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.

రెట్టింపు ఉత్సాహంతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నాను' అంది. తెలుగు.. త‌మిళ్ లో కొన్ని సినిమాల‌కు ఒకే చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే ఆ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో అమ్మ‌డు టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. అటుపై ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బాగా ఫేమ‌స్ అయింది. ఇందులో అమ్మ‌డి న‌ట‌నకి మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

అంత‌కు ముందు.. ఆత‌ర్వాత డిస్కో రాజా..మాస్ట్రో..అల్లుడు అదుర్స్..బ్ర‌తుకే సో బెట‌ర్.. అదుగో లాంటి చిత్రాల్లో న‌టించింది. కానీ ఇవేవి విజ‌యం సాధించ‌లేదు. దీంతో అవకాశాల రేసులోనూ కాస్త వెనుక బ‌డింది. ఇంత‌లో భుజానికి గాయ‌మ‌వ్వ‌డంతో వెండి తెర‌కు పూర్తిగా దూర‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. మ‌రి కంబ్యాక్ లో ఎలాంటి అవ‌కాశాలు అందుకుంటుందో? చూడాలి. ప్ర‌స్తుతం హీరోయిన్ల మ‌ధ్య ఎలాంటి పోటీ ఉందో తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు భామ‌ల వేగం కూడా టాలీవుడ్ లో పెరుగుతుంది. చిన్న సినిమాల్లో తెలుగు హీరోయిన్ల‌కు అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాళ్ల‌తోనూ కొత్త భామ‌లు..కంబ్యాక్ హీరోయిన్లు పోటీ ప‌డాలి.

Tags:    

Similar News