కవ్విస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ అందాలు

ఈ అమ్మడు కన్నడంలో మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది

Update: 2023-08-01 11:10 GMT

2015 సంవత్సరంలో వజ్రకాయ అనే కన్నడ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నాభ నటేష్. ఈ అమ్మడు కన్నడంలో మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2018లో సుదీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే అనే సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంటుంది.


తెలుగులో మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సినీ ప్రముఖుల నుండి ఇంకా విమర్శకుల నుండి ప్రశంసలు దక్కించుకుంది. దాంతో వెంట వెంటనే అవకాశాలు లభించాయి. ముఖ్యంగా రామ్ కి జోడిగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు అందులోని ఈ ముద్దుగుమ్మ పాత్రకి మంచి మార్కులు దక్కాయి.

ప్రస్తుతం సినిమాలేమీ చేయకుండా కూడా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ ఫోటోలతో నెటిజన్స్ ని కవ్విస్తోంది.ఈ రేంజ్ లో అందాలు ఆరబోత చేస్తే స్టార్ హీరోలు సైతం వావ్ అనాల్సిందే. కానీ అదృష్టం కలిసి రాకపోవడం వల్ల ఏమో కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

ఇలాంటి ఫోటో షూట్స్ తో అయినా ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇంత హాట్ అందాల ఆరబోత చేస్తున్న నభ నటేష్ నడుము అందాలు చూపిస్తూ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందు ముందు అయినా ఈమెకి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News