48 ఏళ్ల వయసులో హీరోయిన్‌ పెళ్లి ఆలోచన...!

కనుక పెళ్లి చేసుకోవాలనే తనకు ఉందని తాజాగా నగ్మ చేసిన వ్యాఖ్యలు మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Update: 2023-08-30 08:52 GMT

1990 ల్లో ఎన్నో తెలుగు, హిందీ సినిమా ల్లో నటించిన హీరోయిన్‌ నగ్మ. 2008 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన నగ్మా ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. గతంలో ఈమె ప్రేమ విషయాల గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

నగ్మా పెళ్లి వార్తలు అప్పుడప్పుడు వచ్చినా కూడా వాటిని కొట్టిపారేస్తూ వచ్చింది. ప్రస్తుతం నగ్మ వయసు 48 ఏళ్లు. ఈ వయసు లో ఆమె పెళ్లి చేసుకునే అవకాశం లేదని చాలా మంది భావిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది. తాను పెళ్లి చేసుకోకూడదు అని ఎప్పుడు కూడా అనుకోలేదని పేర్కొంది.

పెళ్లి అయితే పిల్లలతో ఒక సంసార జీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా పెళ్లి చేసుకుంటే ఒక తోడు ఉంటుందని అనిపిస్తుంది. పెళ్లి తర్వాత ఒక కుటుంబం ఏర్పడుతుంది. కనుక పెళ్లి చేసుకోవాలనే తనకు ఉందని తాజాగా నగ్మ చేసిన వ్యాఖ్యలు మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పెళ్లి అయితే తాను సంతోషంగా ఉంటాను అనిపిస్తుంది. సంతోషం అనేది జీవితంలో చాలా కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. అందుకే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది. మరి ఇన్నాళ్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ ఈ సందర్భంగా నగ్మా ను కొందరు ప్రశ్నిస్తున్నారు.

గతంలో నగ్మా ప్రేమ వ్యవహారాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీం ఇండియా మాజీ క్రికెటర్‌ తో ఈమె ప్రేమాయణం సాగించిందని, ఆ తర్వాత సీనియర్ సినీ నటుడు తో కూడా ఈమె ప్రేమలో పడిందనే ప్రచారం జరిగింది. వారికి అంతకు ముందే పెళ్లి అవ్వడం వల్ల ఈమె ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. ఇప్పుడు పెళ్లి కావాలని కోరుకుంటున్న నగ్మా కు తగ్గ వరుడు దొరికేనా చూడాలి.

Tags:    

Similar News