మంచి రోజులు మొదలయ్యాయంటున్న నయన్..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ గా జవాన్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు

Update: 2023-09-14 07:55 GMT

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ గా జవాన్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బాలీవుడ్ లో మొదటి మూవీగా జవాన్ కు సైన్ చేసిన నయనతార ఫస్ట్ సినిమాతోనే అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తుంది. సౌత్ లో నయనతార టాప్ 1 హీరోయిన్ గా ఉన్నారు. ఆమె ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న సినిమాలు అన్నీ ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేస్తున్నాయి. జవాన్ సక్సెస్ తో నయనతార సూపర్ హ్యాపీగా ఉందని తెలుస్తుంది. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన జవాన్ సినిమా కోసం నయనతార 11 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.

మామూలుగానే సినిమాకు 8 నుంచి 10 కోట్ల దాకా తీసుకునే నయనతార బాలీవుడ్ సినిమా కాబట్టి 11 కోట్లను డిమాండ్ చేసిందట. సినిమాలో నయన్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో ఆడియన్స్ ని మెప్పించారు. జవాన్ సినిమాలో దీపిక పదుకొనె కూడా నటించారు. దీపిక నయన్ ఇద్దరు వారి ఫ్యాన్స్ ని అలరించారు. కెరీర్ సక్సెస్ జోరు కొనసాగించడం, ఇద్దరు పిల్లలతో భర్త విఘ్నేష్ శివన్ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది నయనతార.

ఈ క్రమంలో విఘ్నేష్ శివన్ టీ షర్ట్ మీద గుడ్ టైం స్టార్ట్ నౌ అని ఉన్న ఫోటో ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది. మంచి రోజులు మొదలయ్యాయని ప్రత్యేకంగా నయనతార సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆమె ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. జవాన్ హిట్ అనే కాదు లైఫ్ లో అన్ని అనుకున్నట్టుగా జరుగుతున్నాయనే నయన్ ఇలాంటి పోస్ట్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. బాలీవుడ్ లో మొదటి సినిమానే రికార్డులు కొడుతుండగా నయనతారకు అక్కడ నుంచి మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

నయనతార ఏ సినిమా చేసినా అందులో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. జవాన్ తర్వాత కోలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసింది నయనతార. అందులో ఒకటి జయం రవి హీరోగా వస్తున్న ఇరైవన్ కాగా.. మరో సినిమా చేస్తుంది. తెలుగులో కూడా వచ్చిన అవకాశాన్ని చేస్తూ వస్తున్న నయనతార ఇక్కడ కూడా స్టార్ క్రేజ్ కొనసాగిస్తుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్స్ తో నటించిన నయన్ ఈమధ్య సీనియర్ స్టార్స్ తోనే సరిపెట్టుకుంటుంది. అయితే తమిళంలో వరుస సినిమాలు చేస్తుండటం వల్ల కొన్ని తెలుగు సినిమాలకు నయనతార కాదని చెబుతుంది.

Tags:    

Similar News