పాయల్ కిడ్నీ స్టోన్స్.. శస్త్ర చికిత్స?
ఇటీవల పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా చెప్పారు.
ఇటీవల పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా చెప్పారు. కొన్ని రోజులుగా ఆమె ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. సెలైన్‌తో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక లేఖను కూడా విడుదల చేయడంతో అభిమానులు ఆందోళన చెందారు. `నేను చాలా తక్కువ నీళ్లు తాగేదానిని. దీంతో కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకింది. నీళ్లు ఎక్కువగా తాగే వారికి ఇలాంటి సమస్యలు ఉండవు. ఆ ప్రభావం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. ప్రస్తుతం చికిత్స ముగిసింది. నేను యాంటీబయాటిక్స్ చివరి మోతాదు తీసుకున్నాను. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నిటినీ అధిగమించాలి... `` అంటూ కాన్పిడెన్స్ ని వ్యక్తం చేసింది.
ఇప్పుడు తన సినిమా `మంగళవారం` ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తన కిడ్నీ సమస్య గురించి మరోసారి ప్రస్థావించింది పాయల్. మంగళవారం కథతో అజయ్ తన వద్దకు వచ్చేప్పటికి తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని, అయితే కథ నచ్చేయడంతో శస్త్ర చికిత్సను వాయిదా వేసానని తెలిపారు. మంగళవారం రిలీజ్ అయిపోయాక దీనికి సంబంధించిన శస్త్ర చికిత్సకు సిద్ధం కానుందని సమాచారం.
పాయల్ అనారోగ్యం విషయం చాలా కాలం పాటు మీడియాలో ఎక్కడా వైరల్ కాలేదు. పూర్తిగా కోలుకున్న తర్వాత అసలు విషయాన్ని వెల్లడించింది. అయితే కిడ్నీ స్టోన్ సమస్య గురించి తెలియగానే పాయల్ అభిమానులు కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది. పూర్తిగా నయం కావడానికి సమయం పడుతుంది. ఇప్పటికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పాయల్ రాజ్ పుత్ తో ఆర్.ఎక్స్ 100 సీక్వెల్ ని తెరకెక్కించే అవకాశం ఉందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. పాయల్ ఎప్పటికీ తనకు బిగ్ బ్రేక్ ఇచ్చిన అజయ్ భూపతిని గురువుగా భావిస్తుందన్న సంగతి తెలిసిందే.