ఫోటో స్టోరీ : మేడం సర్ మేడం అంతే..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. తన ఒక్క పోస్ట్ తో 24 మిలియన్లకు పైగా మనసులు గెలిచేస్తుంది అమ్మడు

Update: 2023-09-13 09:54 GMT

బుట్ట బొమ్మ పూజా హెగ్దే తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. తన ఒక్క పోస్ట్ తో 24 మిలియన్లకు పైగా మనసులు గెలిచేస్తుంది అమ్మడు. సినిమాలు చేస్తున్నా చేయకపోయినా పూజా హెగ్దే మాత్రం తన ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన ఫోటో షూట్స్ కి అయితే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సినిమాలకు కొద్దిగా గ్యాప్ దొరికింది అనిపిస్తే చాలు వరుస ఫోటో షూట్స్ తో సినిమాల కన్నా ఎక్కువ తన ఇన్ స్టా లోనే ఫాలోవర్స్ ని అలరిస్తుంది అమ్మడు.


ఇదే క్రమంలో లేటెస్ట్ గా ఓ ట్రెండీ వేర్ తో క్రేజీ లుక్స్ తో కుర్రాళ్ల మనసును గాయం చేస్తుంది పూజా బేబీ. స్టైలిష్ డిజైనర్ జాకెట్ తో పూజా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. జాకెట్ కి అక్కడక్కడ చిన్న హోల్స్ ఆమె స్కిన్ టోన్ ని తెలియచేస్తున్నాయి. ఫోటో షూట్స్ లో పి.హెచ్.డి చేసినట్టుగా అనిపించే పూజా హెగ్దే లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన వారు ఎవరైనా సరే మేడం సార్ మేడం అంతే అనక తప్పదు. వేసుకున్న కాస్టూమ్ మాత్రమే కాదు తన చూపులతో కూడా షివరింగ్ తెప్పిస్తుంది పూజా హెగ్దే.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే మహేష్ గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మరో సినిమా కన్ఫర్మ్ కాలేదు. చెప్పుకోవడానికి నాని వివేక్ ఆత్రేయ సినిమా.. రవితేజ నెక్స్ట్ సినిమా హీరోయిన్ అంటున్నారు కానీ వాటిలో ఏది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. తెలుగులో కొద్దిగా గ్యాప్ ఇచ్చిన పూజా హెగ్దే హీరోలో బిజీ అవ్వాలని చూస్తున్నా అక్కడ కూడా ఆశించిన అవకాశాలు లేవని తెలుస్తుంది.

తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దే ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా సరే మళ్లీ ఇక్కడ తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. సెట్స్ మీద ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి కొత్త సినిమాలు స్టార్ట్ అయితే అప్పుడు ఏమన్నా పూజా హెగ్దేకి ఛాన్స్ ఇచ్చే వీలుంటుంది. సినిమాలు ఉన్నా లేకపోయినా తన ఫాలోవర్స్ ని ఇన్ స్టా ఫోటో షూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తూ హడావిడి చేస్తుంది పూజా. బాలీవుడ్, టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్దే అక్కడ ఒక ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉందని తెలుస్తుంది.

Tags:    

Similar News