ఆ పాత్ర చేసేందుకు భయమేసింది : రాశి

బాక్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాశి ఖన్నా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Update: 2024-05-03 04:41 GMT

మనం సినిమాలో గెస్ట్‌ రోల్‌ లో కనిపించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోయిన్‌ గా మారింది. మొదటి సినిమానే కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, నటన విషయంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో పాటు పలువురు యంగ్‌ హీరోలకు జోడీగా నటించడం ద్వారా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. దాదాపు దశాబ్ద కాలంగా ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ఈ మధ్య కాలంలో కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో ఎక్కువ సినిమాలు చేస్తుంది. నేడు ఈమె నటించిన 'బాక్‌' సినిమా విడుదల అయ్యింది.

బాక్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాశి ఖన్నా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇప్పటివరకు తాను పోషించిన పాత్రల్లో, చేసిన సినిమాల్లో కొన్ని కాస్త ఇబ్బందిగా, కష్టంగా అనిపించాయి అంటూ చెప్పుకొచ్చింది. అందులో మారుతి దర్శకత్వంలో చేసిన ప్రతి రోజూ పండగే సినిమా ఒకటి అంది.

ప్రతిరోజూ పండుగే సినిమా లోని ఏంజిల్ ఆర్నా పాత్ర గురించి చెప్పిన సమయంలో ఆ పాత్ర నేను చేయగలనా అనే భయం వేసింది. అందులో చాలా విభిన్నంగా బాడీ లాంగ్వేజ్ ఉండాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆ పాత్రకి చాలా మంది కనెక్ట్‌ అవుతారు కనుక చేయడం ఎలా అని భయపడ్డాను అంది.

ఆ పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని, మారుతి గారి ఇన్‌పుట్స్ ను ఉపయోగించుకుని నటించాను. నటిగా నేను అన్ని రకాల పాత్రల్లో నటించాలని అనుకుంటాను. కనుక తన వద్దకు వచ్చిన పాత్ర కష్టం అనిపించినా కూడా ఛాలెంజ్ గా తీసుకుని నటిస్తాను అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. బాక్ సినిమా తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని రాశి ఖన్నా పేర్కొంది.

Tags:    

Similar News