ఆ సీనియర్ నటికి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా?
రాధ భర్త విదేశాలలో పెద్ద పెద్ద హోటల్స్ నడుపుతున్నారు. వీరి స్థిరచరాస్తుల విలువ 300 కోట్లకి పైగా ఉన్నాయంట. ఇక భర్త పేరు మీద వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.
హీరోయిన్ రాధ అంటే గుర్తుపట్టని వారు ఉండరు. ఒకానొక దశకంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, రాధ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వెంకటేష్, నాగార్జున, బాలయ్యతో కూడా ఆమె సినిమాలు చేసింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్నార్, ఎన్టీఆర్ లతో కూడా కలిసి నటించింది.
సౌత్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రాధ డాన్స్ క్వీన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆమె పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైంది. కేరళకి చెందిన వ్యాపారవేత్త రాజశేఖరన్ నాయర్ ని ఆమె వివాహం చేసుకున్నారు. రాధకి ఇద్దరు కూతుళ్ళు, కొడుకు ఉన్నాడు. కూతుళ్ళు కార్తిక, తులసి ఇద్దరు హీరోయిన్స్ గా అడుగుపెట్టారు. కాని ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.
కార్తిక తెలుగులో రెండు సినిమాలలో నటించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా రాధ కూతురు కార్తిక పెళ్లి కేరళలో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి సౌత్ సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు. ఈ పెళ్లి కోసం కార్తిక ఒంటినిండా భారీగా ఆభరణాలు ధరించింది. వీటిని చూసిన తర్వాత రాధకి ఇన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయా అని సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం.
రాధ భర్త విదేశాలలో పెద్ద పెద్ద హోటల్స్ నడుపుతున్నారు. వీరి స్థిరచరాస్తుల విలువ 300 కోట్లకి పైగా ఉన్నాయంట. ఇక భర్త పేరు మీద వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే కూతురు వివాహాన్ని గ్రాండ్ గా కేరళ నాయర్ సంప్రదాయ పద్ధతిలో చేశారు. కార్తిక హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో తండ్రి చేస్తున్న హోటల్స్ వ్యాపారాన్ని టేకప్ చేసింది.
ప్రస్తుతం ఆమె బిజినెస్ విమెన్ గా దూసుకుపోతోంది. కార్తిక పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా వ్యాపారవేత్త కావడం విశేషం. వారిద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధం అని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఏమైనా కార్తిక సినిమాలు చేసే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని విషయం. రాధ మాత్రం ప్రస్తుతం బుల్లితెరలో షోలకి హోస్ట్ గా వస్తూ సందడి చేస్తున్నారు.