హీరోయిన్లు మారాలంటోన్న మ‌రో హీరోయిన్!

బాలీవుడ్ న‌టి రాణీముఖ‌ర్జీ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ సీనియ‌ర్ న‌టి దూసుకుపోతుంది.

Update: 2023-08-31 23:30 GMT

బాలీవుడ్ న‌టి రాణీముఖ‌ర్జీ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ సీనియ‌ర్ న‌టి దూసుకుపోతుంది. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఎక్కువ‌గా లేడీ ఓరియేంటెడ్ క‌థ‌ల్లోనే క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఆమె అనుభవం..తాజా ప‌రిస్థితుల్ని ఉద్దేశించి హీరోయిన్ల‌కు కొన్ని విలువైన స‌ల‌హాలు ఇస్తోంది. సినిమాల‌కంటే మ‌హిళా ప్రాధాన్య‌మున్న క‌థ‌ల‌తో అల‌రిస్తోన్న ఓటీటీ గురించి మాట్లాడుతూ..

`సినిమాల్లో క‌థానాయిక‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారని నేను న‌మ్ముతున్నాను. కానీ క‌థ‌ని ఎంచుకునే విధానం మార్చుకోవాలి. ఇప్పుడు థియేట‌ర్లో విడుద‌ల‌య్యే సినిమాల‌కంటే ఓటీటీలో విడుద‌ల‌య్యే క‌థ‌ల్నే ఎక్కువ‌గా ఎంచుకుంటున్నారు. వాటికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఇదే త‌ర‌హాలో థియేట‌ర్ లో విడుద‌ల‌య్యే క‌థ‌ల విష‌యంలోనూ హీరోయిన్లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అలా తీసుకుంటేనే స‌క్సెస్ రేట్ బాగుంటుంది.

మ‌న పాత్ర‌ల్ని న‌మ్మి నిర్మాత‌లు కోట్ల రూపాయ‌లు పెడుతున్నారు. వాళ్ల‌తో స‌హా టికెట్ కొని థియేట‌ర్ కి వ‌స్తోన్న ప్రేక్ష‌కుడికి న్యాయం చేయాలి. అవ‌కాశం వ‌చ్చింద‌ని ఏదో క‌థ‌లో న‌టించ‌డం క‌న్నా! ఆ సినిమా వ‌దులుకుని మంచి క‌థ కుదిరిన‌ప్పుడు చేస్తే మ‌జా వేరుగా ఉంటుంది. న‌టులంతా ఎంతో క‌ష్ట‌ప డుతుంటారు. అభిమానులు గుర్తించే వ‌ర‌కూ మేము ఎంతో క‌ష్ట‌ప‌డ‌తాం` అని అంది.

ఇక రాణీముఖ‌ర్జీ లో కొన్ని ఓ ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణంది ఉంది. సినిమా ని ఆస్వాదిస్తోన్న ప్రేక్ష‌కుల ప‌ల్స్ ప‌ట్టుకోవ‌డం కోసం రాత్రి పూట అప్పుడ‌ప్పుడు త‌నని ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా మ‌ప్టీలో సాధార‌ణ ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో కూర్చుని సినిమా చూస్తుంది. ఈ ర‌క‌మైన అలవాటు ఏకైకై న‌టి ఆమె. అలాగే మ‌హిళా హ‌క్కుల‌కు మ‌ద్ద‌తుగానూ నిలుస్తుంది. స‌మాజంలో వారు ఎదుర్కుంటోన్న స‌మ‌స్య‌ల గురించి పోరాటం చేస్తుంటుంది. ఆ ర‌కంగా కెమెరా ముందే కాదు..కెమెరా వెనుక కూడా ఆ మె హీరోయిన్.

Tags:    

Similar News