పెళ్లికి ముందు కష్టాలు.. షాక్ ఇస్తున్న రేణు దేశాయ్ వ్యాఖ్యలు..!

రేణు దేశాయ్ ఈ పేరు వింటే చాలు పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా అలర్ట్ అవుతారు.

Update: 2023-10-16 04:00 GMT

రేణు దేశాయ్ ఈ పేరు వింటే చాలు పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా అలర్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని ఆ తర్వాత ప్రేమించి పెళ్లాడిన రేణు దేశాయ్ అకిరా, ఆద్య పిల్లలు పుట్టాక అతని నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. బద్రి తర్వాత సినిమాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించని రేణు దేశాయ్ అడపాదడపా స్మాల్ స్క్రీన్ మీద కనిపించి అలరించారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రేణు దేశాయ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించారు .

18 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. సినిమాలో గుర్రం జాషువా కూతురు హేమలత లవణం పాత్రలో నటించారు. సినిమాలో ఈ పాత్ర తనకెంతో స్పెషల్ అని చెబుతున్నారు రేణు దేశాయ్. టైగర్ నాగేశ్వర రావు ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో తన పర్సనల్ విషయాల గురించి వెల్లడించారు. రేణు దేశాయ్ అనగానే పవన్ తో పెళ్లి విడాకులే అనుకుంటారు కానీ అంతకు మించిన బాధలు ఆమె చిన్నప్పటి నుంచే ఉన్నాయని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.

తల్లిదండ్రులు అబ్బాయి పుడతాడని అనుకున్న టైం లో నేను పుట్టానని దాంతో నాన్న 3 రోజుల పాటు తనని చూడలేదని అన్నారు. ఊహ తెలిశాక అక్క ఈ విషయం చెప్పాక తనకు చాలా బాధ వేసిందని అన్నారు రేణు దేశాయ్. ఆ తర్వాత మా తమ్ముడు పుట్టాక అతన్ని రాజా బాబులా పెంచారు.. చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొన్న నేను పెద్ద అయ్యే వరకు అది కొనసాగుతూనే ఉందని అన్నారు.

తల్లి ఉండి కూడా ఆమె ప్రేమను అందుకోలేదని.. ఒకసారి అమ్మని ఈ విషయం అడిగితే ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదని అన్నారు రేణు దేశాయ్. తన బాగోగులు అన్నీ పనివాళ్లే చూశారని. తల్లిదండ్రుల ప్రేమను పొందేందుకు బాగా చదివేదాన్ని అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. నా జీవితంలో నేను ఏం కోల్పోయానో అది తన పిల్లలు కోల్పోకూడదని శక్తికి మించి తన బిడ్డలకు ప్రేమను పంచుతున్నానని అన్నారు రేణు దేశాయ్. అకిరా, ఆద్య ఇద్దరు నాకు సమానమే ఎవరిని ఎక్కువగా ఎవరిని తక్కువగా చూడనని ఆమె అన్నారు. వారిద్దరి కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తానని అన్నారు రేణు దేశాయ్.

Tags:    

Similar News