ఎలాంటి స్కిన్ షో లేకుండానే అట్రాక్టివ్ గా!

రుక్మిణి వసంత్.. సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బీ సినిమాలతో కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లో వెంటనే చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ

Update: 2024-07-27 01:30 GMT
ఎలాంటి స్కిన్ షో లేకుండానే అట్రాక్టివ్ గా!
  • whatsapp icon

రుక్మిణి వసంత్.. సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బీ సినిమాలతో కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లో వెంటనే చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ లో రెండో సినిమాతోనే స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఆ రెండు చిత్రాలు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు చూస్తున్నంత సేపు కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్ లా కాదు.. పక్కింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. మూవీలు చూసిన ఆడియన్స్ అందరినీ తనతో లవ్ లో పడిపోయేలా చేసింది అమ్మడు!

బీర్బల్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రుక్మిణి.. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ అప్ స్టార్ట్స్ లో చిన్న రోల్ లో కనిపించింది. అనంతరం సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బి సినిమాల్లో నటించింది. వాటితోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తూ తన యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసింది. మధ్యలో మరో మూవీ కూడా చేసింది. ప్రస్తుతం కన్నడలో బగీర, భైరతి రనగల్ చిత్రాల్లో నటిస్తోంది. కోలీవుడ్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది.

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌ తో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో ఆమె నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు మాస్ మహారాజా రవితేజ మూవీలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. వీటికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రానున్నాయని వినికిడి. బిగ్గెస్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది.

ఇక.. రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ కెరీర్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటోంది. తెలుగు ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుకుంటోంది. చీరల్లో ఎక్కువగా అందాలు ఆరబోస్తుంటోంది. ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ లో పిక్స్ దిగుతూ పోస్ట్ చేస్తుంటోంది. మోడ్రన్ డ్రెస్సెస్ లో అప్పుడప్పుడు సందడి చేస్తుంటోంది. పలు మ్యాగ్ జైన్స్ పై మెరుస్తుంటోంది. గ్లామర్ షో ఎక్కువ చేయకుండానే ఆకట్టుకుంటోంది.

తాజాగా రుక్మిణి పాత పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో జీన్ ప్యాంట్ అండ్ వైట్ టాప్ వేసుకున్న అమ్మడు.. వెనక్కి తిరిగి చూస్తూ అలరిస్తోంది. సింపుల్ గా కింద కూర్చుని మాయ చేస్తోంది. తన చూపుతోనే ఫిదా చేస్తోంది. హెయిర్ లీవ్ చేసి కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది. ఎలాంటి స్కిన్ షో లేకుండానే అట్రాక్ట్ చేస్తోంది. అమ్మడి పిక్ చూసి ఫిదా అయ్యామని నెటిజన్లు చెబుతున్నారు. పాత పిక్ నే మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News