ఖుషీ బాధ్యత నెరవేరింది..న్యూయర్క్ కి సమంత..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తున్నానని ప్రకటించి చాలా రోజులే అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తున్నానని ప్రకటించి చాలా రోజులే అవుతోంది. ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స తీసుకోవాలని అనుకుంది. దాని కోసం షూటింగ్స్ అన్నీ పూర్తి చేసుకొని దాదాపు సంవత్సరం పాటు వీటన్నింటికీ దూరంగా అమెరికా వెళ్లాలని అనుకున్నారు.
నిజానికి సమంత తన షూటింగ్స్ మొత్తం ఎప్పుడో పూర్తి చేసుకున్నారు. షూటింగ్స్ అయిపోగానే, కొన్ని దేవాలయాలను సందర్శించారు. అనంతరం ఈషా ఫౌండేషన్ సద్గురు ఆశ్రమంలోనూ కొద్ది రోజులు సేదతీరారు. ఇంకా, ఎందుకు అమెరికా వెళ్లలేదు అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ, ఆమె భుజాలపై ఖుషీ బాధ్యత ఉంది.
ఆమె నటించిన ఖుషీ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. అయితే, ఈ మూవీ ప్రమోషన్స్ కచ్చితంగా సమంత చేయాల్సిందే. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి రాలేకపోయినా, స్పెషల్ ఖుషీ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. దాంట్లో సమంత విజయ్ తో కలిసి డ్యాన్సులు వేసింది. మూవికి ఎంత అవసరమో, అంత ప్రమోషన్స్ చేసేసింది. అంతేకాదు, విజయ్ తో కలిసి సోషల్ మీడియా సెలబ్రెటీలతో కలిసి కూడా సందడి చేసింది.
ఇప్పుడు, ఖుషీ బాధ్యత కూడా తీరడంతో ఆమె తన చికిత్స పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె అమెరికా బయలుదేరి వెళ్లిపోయింది. గత రాత్రి ఆమె హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లిపోయారు. ఇక, నాలుగైదు నెలలు సమంత మనకు కనిపించకపోవచ్చు. చికిత్స మొత్తం తీసుకున్న తర్వాతే సమంత మళ్లీ హైదరాబాద్ కి రానున్నారు.
కాగా, సమంత, విజయ్ నటించిన ఖుషీ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి శివా నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ లవ్ స్టోరీ. ఈ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఇక ఈ మూవీ హిట్ సమంతతో పాటు, విజయ్ దేవరకొండకు అంతే అవసరం. మరి, వీరికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.