సమంత కూడా రేణుదేశాయ్ పరిస్థితుల్లోనేనా?
పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అభిమానుల కారణంగా ట్రోలింగ్ ఎదుర్కోన్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అభిమానుల కారణంగా ట్రోలింగ్ ఎదుర్కోన్న సంగతి తెలిసిందే. అప్పటివరకూ వదినమ్మ అంటూ ఎంతో అభిమానంతో పిలచుకునే వారంతా ఒక్కసారిగా రేణు దేశాయ్ పై తిరగబడ్డారు. తపంతా తనదే అన్నట్లు దూషించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ పబ్లిక్ గానే వెల్లడించింది. ఇప్పటికీ పవన్ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కుంటూనే ఉంది.
పవన్ పట్ల సానుకూలంగా మాట్లాడితే ఒకే లేదంటే? ఎటాకింగ్ తప్పదు. విడిపోయి ఎవరి జీవితాలు వారు గడుపుతున్నా! రేణు దేశాయ్ ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సిందే. తాజాగా సమంత కూడా అదే పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ తన జీవితంలో తాను బిజీ అయింది. తనకు నచ్చిన విధంగా స్వేచ్ఛా జీవితం గడుపుతుంది.
ఇటీవలే ఆమె నటించి `ఖుషీ` రిలీజ్ అయింది. అందులో విజయ్ దేవరకొండతో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. భార్య పాత్ర పోషించింది. ఆలుమగల ధాంపత్య జీవితాన్ని సినిమాలో బాగానే హైలైట్ చేసారు. అయితే ఇదే సమంతపై చైతన్య అభిమానులు నిప్పులు కురిపించేలా చేసింది. విజయ్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం పట్ల చైతన్య అభిమానులు హర్ట్ అయినట్లు సోషల్ మీడియా కామెంట్లు చెబుతున్నాయి.
అభిమానుల మనసులు నొచ్చుకునేలా సమంత నటిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇది ఎంతవరకూ సమజసం అంటూ కొన్ని రకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీతో సమంతకి ఎలాంటి సంబంధాలు లేవు. చైతన్య తో విడాకులతో వేరైంది. ఎవరి జీవితాలు వారు గుడుపుతున్నారు. అయినా సమంతని ఇంకా అక్కినేని ఇంట కోడలిగానే కొంత మంది అభిమానులు భావించి ఇలా నటించకూడదంటూ ఆక్షలు విధించడం ఆసక్తికరం. ఈ విషయంలో కొంత మంది కళ్లు తెరిచి వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉందంటూ సమంత మద్దతుదారులు కోరుతున్నారు.